పవన్ కొత్త సినిమా పేరు ‘పంజా’
పవన్‌కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘పంజా’ అనే టైటిల్ నిర్ణయించారు. చిత్ర నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఈ సినిమాకి ఏ టైటిల్ పెడతామా అనే అభిమానులు చాలా కాలంగా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కథానుగుణంగా, పవన్‌కళ్యాణ్‌కున్న మాస్ ఇమేజ్‌ని దృష్టిలె పెట్టుకుని పవర్‌ఫుల్ టైటిల్ పెట్టాలని ఆలోచించాం. ‘పంజా’ అనే టైటిల్ ఈ కథకు చాలా యాప్ట్. కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇప్పటివరకూ పవన్‌కళ్యాణ్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అని అన్నారు. ఈ చిత్రానికి ముందుగా షాడో అనే టైటిల్ అనుకున్నారు.. కానీ.. పంజా టైటిల్‌ని ఖరారు చేసారు. పవన్‌ని ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తాడు. ఈ పంజా చిత్రానికి పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో పూర్తిచేస్తున్నాడు. ఈ మధ్య పవన్‌కి సక్సెస్‌లు చాలా తక్కువగా వచ్చాయి. ఈ పంజా చిత్రం ఘనవిజయం సాధిస్తుందని పవన్ పూర్తి నమ్మకంగా ఉన్న...