పోస్ట్‌లు

chandrababu naidu naidu tdp kirankumar reddy bothsa satyanarayana congress party congress leaders nadendla manohar political news political articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నిర‌స‌న‌ల మ‌ధ్య బాబు టూర్‌..

చిత్రం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న రెండు కళ్ళ సిద్ధాంతం తెలంగాణ వాదులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పోరుబాట యాత్రను మంగళవారం కరీంనగర్ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ యాత్రను అడ్డుకుని తీరుతామని తెలంగాణ వాదులతో పాటు తెరాస నేతలు హెచ్చరించారు. ఏది ఏమైనా యాత్ర జరిగి తీరుతుందని తెదేపా శ్రేణులు ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు యాత్ర మంగళవారం ఉదయం 11 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గం లంబాడిపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెడతారని ఆ పార్టీ మీడియా విభాగం తెలిపింది. సీతారాంపూర్, ములకనూరు, మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామాల మీదుగా నుస్తులాపూర్‌కు యాత్ర చేరుకుంటుందని వివరించింది. సాయంత్రం 5 గంటలకు నుస్తులాపూర్‌లో బహిరంగ సభ జరుగుతుందని తెలిపింది. ఇదిలావుండగా, తెలంగాణపై వైఖరిని స్పష్టం చేయకుండా రెండు కళ్ల వాదం, తటస్థ సిద్ధాంతమంటూ నాలుక మడతపెట్టే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును ఇక తెలంగాణలో తిరుగనీయకూడదు… జై తెలంగాణ అ...

ముడుపులు అంద‌లేద‌నేనా..?

చిత్రం
మద్యం సిండికేట్లపై దాడుల వెనుక వాటాలే లక్ష్యమంటూ మీడియాలో కధనాలు వస్తున్నాయి.దీనికి ప్రధానంగా ముఖ్యనేత సోదరుడు ఒకరు కారణమని, ముఖ్యనేత అని చెప్పడం ద్వారా పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడే ఈ కధ నడిపించారని సాక్షి కధనాన్నిఇచ్చింది. ఈ అభియోగంలో ఎంత నిజం ఉందో కాని కాస్త సంచలనంగానే ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిజాయితీగా పాలన చేయడానికి యత్నిస్తున్నారని అభిప్రాయం కలుగుతున్న తరుణంలో ఇలాంటి కధనం రావడంలో అందులో వాస్తవం ఉందా? లేక ఆయనను అప్రతిష్టపాలు చేయడం లక్ష్యమా అన్నది చూడాల్సి ఉంటుంది. ముఖ్యనేత అంటే ముఖ్యమంత్రి అన్న అర్ధం వచ్చే విధంగా డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనకు వ్యతిరేకంగా రాసే కధనాలలో ఆ పదం వాడుతున్నారు. తాజా కధనం ప్రకారం మద్యం సిండికేట్ల నుంచి ముఖ్యనేత సోదరుడు పది కోట్ల రూపాయల వాటా అడిగారని, దానిపై ఒప్పందం కుదరనందునే ఆయా జిల్లాలలో మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు చేయించారని రాశారు. అయితే ఇందులో రెండు అవసరాలు ఉన్నాయి. ఒకటి బొత్సను దెబ్బతీయడం అన్న విశ్లేషణ, మరొకటి ఆర్ధిక అ...

రాజీవ్ కిర‌ణాల‌పై బొత్స సందేహం

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య అంతరం రోజురోజుకు పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం మంత్రివర్గం సమావేశంలో ముఖ్యమంత్రిని నిలదీసిన బొత్స , దానికి కొనసాగింపుగా రాజీవ్ యువకిరణాలు స్కీమ్ గురించి ప్రశ్నించిన తీరు ఆసక్తికరంగా ఉంది. లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమని బొత్స ప్రశ్నించగా,అది సాధ్యమేనని,ఇచ్చి చూపిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విశేషం.ప్రభుత్వ స్కీముపై పిసిసి అధ్యక్షుడికే సందేహాలు వస్తే మిగిలినవారిని సంతృప్తిపరచడం ఎలా అన్నప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. కాగా 104,108 మొబైల్ సర్వీసులకు సంబంధించి జరుగుతున్న చర్చలకు తనను కూడా పిలవాలని బొత్స మంత్రి డి.ఎల్ రవీంద్రరెడ్డికి లేఖ రాయడం ఆసక్తికరంగా ఉంది. మెల్లగా ఇతర అంశాలు సర్దుకునే కొద్దీ కాంగ్రెస్ లో వర్గ పోరు బయట పడుతుంటుంది. ఇప్పుడు జరుగుతున్న అదేలా కనబడుతోంది.

బాబు త‌లుచుకుంటే ప్రభుత్వం కూలుతుంది

చిత్రం
కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ ప్రాణం చంద్రబాబు చేతిలో ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. చంద్రబాబు తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుందని, టీడీపీ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ శనివారం విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ ఏ కారణం చూపకుండా అవిశ్వాస తీర్మానం పెట్టిందన్నారు. టీడీపీ మోసపూరిత వైఖరికి ఇదే నిదర్శనమని, తనపై సీబీఐ కేసులు పెట్టారనే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం అవసరం లేదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సభలో తెలంగాణ తీర్మానం చేశాకే అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నది తమ డిమాండ్ అని అన్నారు. ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం తమకు లేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

హైకోర్టులో బాబు వెకేట్ పిటిషన్

చిత్రం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పిటిషన్‌పై హైకోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. విజయమ్మ తనపై రాజకీయ దురుద్దేశ్యంతోనే పిటిషన్ వేశారని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా తమ వాదనలు ఏమాత్రం వినకుండానే ప్రాథమిక విచారణకు ఆదేశించారని మా వాదనలు వినేంత వరకు విచారణను నిలుపుదల చేయాలని అందులో కోరారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, టిడిపి నేత సిఎం రమేష్, నామా నాగేశ్వర రావు కూడా ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా చంద్రబాబు ఆస్తుల కేసు విషయంలో ప్రతివాదులుగా ఉన్న రామోజీరావు, సిఎం రమేష్, నామా నాగేశ్వర రావు సుప్రీం కోర్టును ఆశ్రయించడం, కేసులో ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోమని కోర్టు వారికి సూచించడంతో పాటు హైకోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు సూచన మేరకు వారు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు సుప్రీంకు వెళ్లనప్పటికీ ఆ కోర్టు సూచనల దృష్ట్యా హైకోర్టును సోమవారం ఆశ్రయించారు.

అసెంబ్లీ భ‌ద్రత‌పై స్పీక‌ర్ స‌మీక్ష

చిత్రం
డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ దినేష్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ, నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్, ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ ఆనంద్ హాజరయ్యారు. సమీక్ష అనంతరం ఏకేఖాన్ మీడియాతో మాట్లాడుతూ శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సభలు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలకు కూడా పటిష్ట బందోబస్తు ఉంటుందని ఏకే ఖాన్ తెలిపారు.

చంద్రబాబు, నారాలోకేష్‌ల‌కి నోటీసులు

చిత్రం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్ లకు సీబీఐ సోమవారం నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులుపై సీబీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.

చంద్రబాబు, నారాలోకేష్‌ల‌కి నోటీసులు

చిత్రం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్ లకు సీబీఐ సోమవారం నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులుపై సీబీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.

త‌న మార్కు పాల‌న‌కై కిర‌ణ్ త‌హ‌త‌హ‌

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్ర వేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్కీములను మరిపించడానికిగాను కొత్త కొత్త పధకాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రూపాయికి కిలో బియ్యం పధకం, రాజీవ్ యువ కిరణాలు వంటి స్కీములను ఆరంభించిన కిరణ్ తాజాగా మహిళలకు వడ్డీలేని రుణాల పధకాన్ని ప్రకటించారు. పదివేల కోట్ల రూపాయల మేర రుణాలను వడ్డీ లేకుండానే ఇస్తామని ఆయన చెప్పారు.ఇప్పుడిప్పుడు కుదుటన పడుతున్న కిరణ్ ప్రభుత్వం కొత్త పధకాల ద్వారా ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్రక్రియలో ఆయన విజయవంతంగా బయటపడతారా? అన్నది చూడాలి.