పోస్ట్‌లు

music director anil murder mystery anil tollywood movie movie news movie reviews లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అనుమానాల‌కి తెర‌..

చిత్రం
సంగీత దర్శకుడు అనిల్ రెడ్డిది సహజమరణమే అని ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. మెదడులో నరాల చిట్లడం వల్లే అనిల్ రెడ్డి మరణించినట్లు ఉస్మానియా వైద్యులు తెలిపారు. అనిల్‌రెడ్డ్డిది సహజమరణం కాదంటూ ఆయన కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం రీపోస్టుమార్టం నిర్వహించారు. గ‌తంలో రెండు సార్లు పోస్టుమార్టం నిర్వ‌హిం చ‌డం, ఒక నివేదిక‌లో అనిల్ త‌ల‌కి బ‌ల‌మైన దెబ్బ త‌గ‌ల‌డంతో మ‌ర‌ణించాడ‌ని తేలడం, దాంతో అనిల్ కుటుంబ స‌భ్యులు మ‌ళ్లీ పోస్ట్ మార్ట‌మ్ కోసం డిమాండ్ చేయ‌డంతో మ‌రోమారు అనిల్ మృత‌దేహానికి పోస్టుమార్టం నిర్వ‌హించారు.  ర‌క‌ర‌కాల ఊహాగానాల‌కి తెర‌తీస్తూ అనిల్ మృతి స‌హ‌జ‌మైన‌దే అని డాక్ట‌ర్లు నిర్ధారించ‌డం విశేషం.

యువ సంగీత ద‌ర్శ‌కుడి మృతి వెనుక‌..?

చిత్రం
ఓ యువ సంగీత దర్శకుడి గుండె ఆగిపోయింది. ప్రేమ పెళ్లి కెరీర్‌పై కలలు గన్న అతడి హృదయం అర్ధంతరంగా నిలిచిపోయింది. మొదట సహజమరణమని సరిపెట్టుకున్నా తర్వాతి పరిణామాలు అతని మృతిపై సందేహాలు రేకెత్తించాయి. ఆ అనుమానాలకు ఆధారాలు కూడా దొరకడంతో సహజ మరణం కాస్తా అనుమానాస్పద మృతిగా మారిపోయింది. అసలు ఎవరా మ్యూజిక్‌ డైరెక్టర్‌.. ఏమా కథ…. అరడజను సినిమాలకు పైగా మ్యూజిక్‌ డైరెక్షన్‌ చేసిన ఇతని పేరు అనిల్‌.ఆర్‌. ఇప్పుడిప్పుడే కెరీర్‌ పరంగా ఎదుగుతున్నఈయనకు షాలిని అనే అమ్మాయి పరియమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి క్రమంగా పెళ్లికి దారితీసింది. అంరంగ వైభవంగా నిశ్చితార్ధం జరిగింది. పెళ్లి డేట్‌ ఫిక్స్‌ అయింది. మనసుపడ్డ మగువతో మనువు కాబోతుందన్న సంతోషంలో ఉన్న అనిల్‌.. పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కాబోయే శ్రీమతిని కలిసొద్దాం అని ఆమె ఇంటికి వెళ్లిన అనిల్‌ హఠాత్తుగా అపోలో ఆస్పత్రిలో శవమై కనిపించాడు. దీంతో ఖంగుతిన్న కుటుంబసభ్యులు ఇదేంటని షాలినిని అడిగితే… తమ ఇంటికి వచ్చిన అనిల్‌ మాట్లాడుతూ ఉన్నట్టుండి కుప్పకూలాడని… దాంతో ఆస్పత్రికి తీసుకొచ్చామని జవాబిచ్చింది. అంతా తమ ఖర్మ అనుకున్న అ...