వైఎస్ జగన్ వరాల జల్లులు..
నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్లీనరీలో ప్రసం గించారు.ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపు తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో వివరించి చెప్పారు. అంతేకాదు తాను అధికారంలోకి వస్తే పేదవారికి స్వర్ణయుగం వచ్చినట్టే నని అభివర్ణించారు. అంతేకాదు..రాష్ట్ర బడ్జెట్ ప్రకారం ఆచరణ సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాపేదలకి వరాల జల్లులని కురిపించాడు. అంతా బాగానే ఉంది కానీ.. కనుచూపు మేరలో ఎన్నికలు కూడా లేవు.. అప్పుడే తమ పార్టీ అధికారంలోకి వస్తే.. అంటూ తాను ముఖ్యమంత్రిని అయితే అంటూ ప్రసంగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.. జగన్ వుద్దేశ్యం ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే పడిపోతుందేమోనని, మధ్యంతర ఎన్నికలు వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మ్రోగిస్తుందన్నంత ధీమాతో వైఎస్ జగన్ ప్రసంగం సాగింది.. అంతేకాదు వైయస్సార్ మృతికి దిగ్భ్రాంతికి గురై మరణించినవారి కుటుంబాలను తాను పరామర్శించడానికి వేలాది కిలోమీటర్లు తిరిగానని, తాను తిరిగినంతగా ఏ రాజకీయ నాయకుడు కూడా...