పోస్ట్‌లు

dookudu maheshbabu samantha srinu vaitla tollywood movies movie reviews dookudu movie review dookudu movie reviews dookudu preview dookudu review tollywood movie news tollywood news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

దూకుడు తొలిరోజు రికార్డ్ కలెక్ష‌న్‌..

చిత్రం
ప్రిన్స్‌ మ‌హేష్‌బాబు, శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం దూకుడు. ఈ చిత్రం వ‌సూళ్ళ ప‌రంగా రికార్డ్ సృష్టిస్తోంది. సెప్టెంబ‌ర్ 23న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌యిన ఈ చ‌త్రం మొదటి రోజు రూ. 12.56 కోట్ల గ్రాస్‌ని, రూ. 10.11 కోట్ల షేర్‌ని వసూలు చేసింది. తొలిరోజు వసూళ్లలో ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది. ఓవర్సీ స్‌లో రెండు రోజులకు ఒక మిలియన్ డాలర్లు వసూలు చేసి అక్కడా ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది. ఇండస్ట్రీలోని అన్ని రికార్డుల్ని అధిగమించే దిశగా ‘దూకుడు’ దూసుకుపోతోంది. ఇంత సూపర్‌హిట్ చిత్రాన్ని మా సంస్థకు అందించిన సూపర్‌స్టార్ మహేశ్ గారికీ, దర్శకుడు శ్రీను వైట్ల గారికీ, ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకూ, కృష్ణ-మహేశ్ అభిమానులకూ నిర్మాత‌లు త‌మ కృత‌జ్ఞ‌త‌ల‌ని తెల‌య‌జేశారు.

దూకుడుకి లెన్త్ ప్రాబ్రెమ్‌..

చిత్రం
‘దూకుడు’ చిత్రం ఈ నెల 23న అంటే రేపు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 50400 ఫీట్స్ తో ఉంది. రెండు గంటల యాభై నిముషాల రన్ టైమ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏ చిత్రమూ ఇంత లెంగ్త్ తో రావటం లేదు. దాంతో ఈ చిత్రంకి లెంగ్త్ సమస్య వస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే మహేష్ తన మెస్మరిజంతో దాటేస్తే అది పెద్ద సమస్య కాదని అంటున్నారు.ఇక ఈ మధ్య కాలంలో ఏ చిత్రం అయినా కేవలం రెండు గంటల పది నిముషాలు మాత్రమే ఉండేటట్లు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క దూకుడు కి చివరి అరగంట చాలా కీలకమైందని, అందుకే దాన్ని ఎడిట్ చేసి కుదించలేదని అంటున్నారు. నాన్ స్టాప్ గా అరగంట సేపు నవ్వించేలా కథనం రూపొందించారని అంటున్నారు. అలాగే సినిమాలో చాలా సీన్స్ లో మహేష్ తో బ్రహ్మానందం కనపించి నవ్వించనున్నారు.