పోస్ట్‌లు

nandamuri balakrishna chandrababu naidu harikrishna telugudeshamm party balakrishna political entry political news political articls special news gossips hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రాజీకీయాల్లోకి వ‌స్తా – బాల‌కృష్ణ‌

చిత్రం
వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తానని సినీహీరో నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. నిరుపేద మహిళల సహాయార్థం క్రీసెంట్ క్రికెట్ కప్ టాలీవుడ్ మ్యాచ్‌ను అనంతపురంలో ఏర్పాటు చేశారు.  ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు బాలకృష్ణతో సహా దాదాపు 30 మంది సినీ తారలు ఇక్క‌డికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య త‌న రాజ‌కీయ ఎంట్రీ గురించి వ్యాఖ్యానించారు.   తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని, ఎన్నిక‌ల్లో పోటీ ఎక్కడ నుంచి చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ త‌ర‌పున రాజ‌కీయాల్లో క్రియాశీల పాత్ర‌ని కొన‌సాగిస్తాను కానీ సిఎం ప‌ద‌విపై మాత్రం ఆస‌క్తి లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి బాల‌య్య చేసిన ఈ కామెంట్ రాజ‌కీయాల్లో ఎలాంటి ప‌రిణామాలు తీసుకువ‌స్తాయో చూడాలి.