పోస్ట్‌లు

emaar properties bharati cements ys jagan mohan reddy ys sharmila sakshi tv channel sakshi tv telugu media telugu movies chandrababu naidu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మేము ఎమ్మార్ తెస్తే.. వారు గోల్‌మాల్ చేసారు..

చిత్రం
ఆంద్రప్రదేశ్ అభివృద్దిలో ముందంజలో ఉండాలని తాము ఆరోజులలో కృషి చేశామని, సైబరాబాద్, హైటెక్ సిటీ,మెట్రో ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులు తీసుకు వచ్చామని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్.ఆర్. ప్రాపర్టీస్ పై వచ్చిన విమర్శలపై వివరణ ఇవ్వడానికి మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. కన్వన్షన్ సెంటర్, గోల్ఫ్ కోర్టు వంటివి ఉంటే పెట్టుబడులు వస్తాయని బావించి ఎమ్.ఆర్.ప్రాపర్టీస్ ప్రాజెక్టును ఒప్పుకున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ కూడా చెప్పారని,అంత మంచి ప్రాజెక్టును స్కాండల్ గా తయారు చేశారని అన్నారు. ఎమ్.ఆర్.కు సంబంధించి గ్లోబల్ టెండర్లు పిలిచి తాము ఎంపిక చేశామని అన్నారు. టౌన్ షిప్ లో ఇరవై ఆరు శాతం, కన్వెన్షన్ సెంటర్ లో 49శాతం ప్రభుత్వానికి వాటా ఉండేలా చేశామన్నారు.కొంతమంది కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చంద్రబాబు అన్నారు. ఎమ్.ఆర్. ప్రాపర్టీస్ ను ఒక మంచి ఉద్దేశంతో తెస్తే కాంగ్రెస్ దానిని కుంభకోణాలమయంగా మార్చిందని అ...