14 ఎఫ్ క్లియర్ తర్వాతే..
14 ఎఫ్ ను తొలగించాకే హైదరాబాద్ కు సంబంధించిన ఎస్సై పరీక్ష ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్సై పరీక్షలో హైదరాబాద్ కు సంబంధించిన ఎలాంటి నియామకాలు చేపట్టడం లేదన్నారు. ఈ ఎస్సై పరీక్షలో హైదరాబాద్ కు సంబంధించి ఒక్క ఉద్యోగమూ లేదన్నారు. 14 ఎఫ్ తొలగింపుపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై హోంశాఖ అడిగిన సందేహాలన్నింటికీ.. సమాధాన మిచ్చామని బొత్స తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులతో పాటు.. ఉద్యమనాయ కులు, ప్రజాసంఘాలు గుర్తించాలని బొత్సా సత్యనారాయణ సూచించారు. కాగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణకు ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఆయన మంగళవారం విశాఖ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు.