పోస్ట్‌లు

sachin tendulkar new home persional home made in bandra sachin indian cricketer sports news sports articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

స‌చిన్‌కి జ‌రిమానా విధించిన బిఎంసీ

చిత్రం
కొత్త ఇంటి మురిపెం తీరముందే బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్‌కు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) భారీ జరిమానా వడ్డించింది. ఎంతో ముచ్చటపడి ముంబయి శివారు ప్రాంతం బాంద్రాలో ఓ పాత భవంతిని కొనుగోలు చేసి దాన్ని తన అభిరుచులకనుగుణంగా ఆధునీకరించుకున్న సచిన్… ఆ ఐదు అంతస్థుల కొత్త ఇంటికి బీఎంసీ నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ (ఓసీ) తీసుకోలేదట. దీంతో బీఎంసీ ఈ మాస్టర్‌బ్లాస్టర్‌కు రూ. 4.35 లక్షల మేరకు పెనాల్టీ విధించింది. ఈ జరిమానాను సచిన్ చెల్లించినట్టు సమాచారం. కాగా, బీఎంసీ అధికారి ఒకరు ఈ విషయం గురించి మాట్లాడుతూ, ముందు జరిమానా చెల్లించాల్సిందేనని, ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లో ఓసీ పొందవచ్చని వెల్లడించారు.

సచిన్ సొంతింటి క‌ల నెర‌వేరింది..

చిత్రం
ఏన్నో ఏళ్లుగా కలలు కన్న ఇంట్లోకి సచిన్ టెండూల్కర్ బుధవారం గృహప్రవేశం చేశాడు. ఇంతకుముందు స్పోర్ట్స్ కోటా కింద వచ్చిన ఫ్లాట్‌లో నివసించి న టెండూల్కర్.. బాంద్రా శివారుల్లోని పెర్రీ క్రాస్ రోడ్ వద్ద ఆరు వేల గజాల స్థలంలో తనకు నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకున్నాడు. ‘సొంత ఇంటి విషయంలో ప్రతి ఒక్కరు ఎన్నో కలలు కంటారు. నేను కూడా అంతే. నా కలను నిజం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. అయితే మొన్నటి దాకా నివసించిన స్పోర్ట్స్ కోటా ఇంటిని వెంటనే ఖాళీ చేశాను. ఎందుకంటే ఆ ఇల్లు మరో క్రీడాకారుడికి ఉపయోగపడతుం ది’అని సచిన్ అన్నాడు. ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లకముందే జూన్ 11న గృహ శాంతి, వాస్తు పూజలు చేసినట్టు తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత తొలిసారిగా తన తల్లిని తీసుకొని కొత్త ఇంటికి వచ్చాడు. పిల్లలకు ఇంకా ఇల్లు చూపించలేదని సచిన్ చెప్పా డు. తన కలల కోటను కోసం సచిన్ మొత్తం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. బం గ్లా చుట్టూ ఫెన్సింగ్‌తో కూడిన ఎత్తయిన గోడ నిర్మించాడు. సీసీ కెమెరాలు, సెన్సర్లను కూడా అమర్చాడు. భూ మట్టానికి పైన మూడు అంతస్తులు, కింద రెండు సెల్లార్‌లు ఉన...