పోస్ట్‌లు

reduce petrol rates ibp indian oil hindustan petroleum august 15th indipendance day manmohan singh soniagandhi political news special news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పెట్రోమంట అంద‌రికీ త‌గిలింది

చిత్రం
పెట్రోలు ధ‌ర 3.50 పైస‌లు పెరిగింది. దీనిపై దేశ‌వ్యా ప్తంగా తీవ్ర నిర‌సన వెల్లువె త్తుతోంది. మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో దాదాపు ప‌ది రూపాయ‌ల వ‌ర‌కు పెట్రోలు ధ‌ర‌ని పెంచ‌డం ప‌ట్ల ప్ర‌తి ప‌క్షాలు మండిప‌డుతు న్నాయి. ప్ర‌భుత్వం, ప్రైవేటు కంపెనీల‌తో కుమ్మ‌ క్క‌యి పెట్రోలు ధ‌ర‌ని నియం త్రించ‌కుండా వారు సూచించిన ప్ర‌కారం పెంచు కుంటూ వెళుతోంద‌ని ప్ర‌తి ప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌తో పాటు పెట్రోలు, గ్యాసు ధ‌ర‌ల‌ని ప్ర‌భుత్వం పెంచుకుంటూ పోతుంటే సామాన్యుడి బ్ర‌తుకు మ‌రింత భారం అవుతుంద‌నీ, ఇప్ప‌టికే రాష్ట్రంలో వ్యాట్ పెంపుతో స‌త‌మ‌త‌మ‌వుతుంటే ఇప్పుడు పెట్రో వాత కూడా తోడు కావ‌డం ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త‌ని తీసుకువ‌స్తుంద‌ని భావిస్తున్నారు. అయితే అంత‌ర్జాతీయ మార్కెట్లో ప్ర‌స్తుతం క్రూడాయిల్ ధ‌ర త‌గ్గింద‌నీ, అక్క‌డ ధ‌ర త‌గ్గినా పెట్రోలు ధ‌ర‌ని పెంచ‌డం ఎంత వ‌ర‌కూ న్యాయ‌మ‌న్న మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది.

నిన్న వ్యాట్ వాత‌.. నేడు పెట్రోల్ మంట‌..

చిత్రం
రాష్ట్ర కేంద్ర ప్ర‌భుత్వాలు త‌మ ప‌బ్బం గ‌డుపుకోవ‌డానికి జ‌నంపై భారం మోపుతూనే ఉన్నారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ వారు వెనుక‌డుగు వేయ‌డం లేదు. లీట‌రు పెట్రోలు డెబ్బై రూపాయ‌లు దాటిన‌ప్ప‌టికీ మ‌ళ్ళీ మ‌రో 4 రూపాయ‌లు పెంచేందుకు కేంద్రం యోచిస్తోంది. దాదాపుగా ఈ పెరుగుద‌ల ఖాయంగానే క‌నిపిస్తోంది. అమెరిక‌న్ డాల‌ర్‌తో ఇండియ‌న్ రూపాయి విలువ త‌గ్గ‌డం వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌స్తోంద‌ని చ‌మురు కంపెనీలు చెబుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై ప్ర‌భుత్వ నియంత్ర‌ణ ఎత్తేసిన త‌ర్వాత కంపెనీలు త‌మ ఇష్టానుసారం ధ‌ర‌ల‌ను పెంచేస్తున్నాయి. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ల‌పై ఉన్న స‌బ్సిడీల‌ను ఎత్తేసి బ‌హిరంగ మార్కెట్‌తోస‌మానంగా ధ‌ర‌లు ఉండాల‌న్న భావ‌న‌కి కూడా చ‌మురు కంపెనీలు వ‌చ్చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అదే జ‌రిగితే ధ‌ర‌ల పెరుగుద‌ల మ‌రింత‌గా ఉండే ప్ర‌మాదం ఉంది. నిత్యావ‌స‌ర వ‌స్తువులు, పెట్రోలు వంటి వాటిపై ఎడాపెడా ప‌న్నులు పెంచేసి, ధ‌ర‌లు పెంచేసి ప్ర‌భుత్వం త‌మ ఖ‌జానాను నింపుకునే ప్ర‌య‌త్నం చేస్తుందే త‌ప్ప ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో స‌మాన్యుడు ఎలా బ్ర‌తక‌...

ఆగ‌ష్టు ప‌దిహేనున బంప‌ర్ ఆఫ‌ర్‌

చిత్రం
స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా భార‌త ప్రభుత్వం ప్రజ‌లు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ (?) ఇస్తోంది. అదేమి‌టం టారా..? ఈ మ‌ధ్యకాలంలో భారీగా పెరిగి పెట్రోలు ధ‌ర‌ల‌ని కొద్దిగా త‌గ్గించాల‌నుకోవ‌డ‌మే ఈ ఆఫ‌ర్‌. లీట‌రుకి రూపాయిన్నర త‌గ్గించ‌డానికి ఆ యిల్ కంపెనీలు యోచిస్తున్నాయి. సంవ‌త్సర‌కాలంలో దాదాపు 10 రూపాయ‌ల వ‌ర‌కు పెరిగిన పెట్రోలు ఛార్జీల‌ని రూ. 1.5 నామ‌మాత్రంగా త‌గ్గిస్తున్నారు. ఈ త‌గ్గుద‌ల వినియోగ‌దారుల‌కి పెద్దగా లాభం చేకూర్చక‌పోయినా కొంత‌లో కొంత ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. తగ్గిన రేట్లు ఆగష్టు 15 నుంచి అమలు జరిగే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడమే కారణమ‌ని తెలుస్తోంది.