ఆగ‌ష్టు ప‌దిహేనున బంప‌ర్ ఆఫ‌ర్‌


స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా భార‌త ప్రభుత్వం ప్రజ‌లు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ (?) ఇస్తోంది. అదేమి‌టం టారా..? ఈ మ‌ధ్యకాలంలో భారీగా పెరిగి పెట్రోలు ధ‌ర‌ల‌ని కొద్దిగా త‌గ్గించాల‌నుకోవ‌డ‌మే ఈ ఆఫ‌ర్‌. లీట‌రుకి రూపాయిన్నర త‌గ్గించ‌డానికి ఆ యిల్ కంపెనీలు యోచిస్తున్నాయి. సంవ‌త్సర‌కాలంలో దాదాపు 10 రూపాయ‌ల వ‌ర‌కు పెరిగిన పెట్రోలు ఛార్జీల‌ని రూ. 1.5 నామ‌మాత్రంగా త‌గ్గిస్తున్నారు. ఈ త‌గ్గుద‌ల వినియోగ‌దారుల‌కి పెద్దగా లాభం చేకూర్చక‌పోయినా కొంత‌లో కొంత ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. తగ్గిన రేట్లు ఆగష్టు 15 నుంచి అమలు జరిగే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడమే కారణమ‌ని తెలుస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!