యుద్ధకాంక్ష
యుద్ధం మహా భయంకరమైనది.
అది నిద్రపోనివ్వదు. మనశ్శాంతిని దూరం చేస్తుంది.
శత్రుత్వాన్ని పెంచిపోషిస్తుంది.
అది నిద్రపోనివ్వదు. మనశ్శాంతిని దూరం చేస్తుంది.
శత్రుత్వాన్ని పెంచిపోషిస్తుంది.
భయంకరమైన ఆయుధాలను సమీకరించుకోవాలన్న ఆకాంక్ష పెరిగిపోతుంది.
సరిగా, ఈ ఆలోచనతోనే అనేక దేశాలు అణ్వాయుధాలను సంపాదించుకుంటున్నాయి. అణుపాటవ పరీక్షల పట్ల ఆసక్తి చూపుతున్నాయి. చివరకు ఈ పోటీ ఎటు దారితీస్తుంది? మానవ సంక్షేమమా…? వినాశనమా??
అణువు…ఇది అత్యల్పమైనదే కావచ్చు. కంటికి కనిపించకపోవచ్చు. కానీ బ్రహ్మాండంలో ఎంతటి శక్తి ఉందో, అణువులోనూ అంతటి శక్తి నిభిడీకృతమైఉంది. ఈ సత్యాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏనాడో చెప్పినట్టు మన ఇతిహాసాల్లో ఉంది. అణుశక్తిని సద్వినియోగం చేసుకుంటే ఏంతటి మేలు చేకూరుతుందో, వినాశనానికి ఉపయోగించుకుంటే, అంతటి విలయం సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పొఖ్రాన్ పరీక్షలు
అణుపాటవ పరీక్షలు చేయడంలో తప్పుకాదు, కానీ వాటి వెనుక ఉన్న లక్ష్యాలు మానవ హితాన్నే సూచించాలి. మనదేశంలో అణుపాటవ పరీక్షలనేటప్పటికీ కచ్చితంగా పొఖ్రాన్ పరీక్షలే గుర్తుకువస్తాయి. 1974లో పొఖ్రాన్ మొద
టి అణుపరీక్ష జరుగగా, 1998లో పొఖ్రాన్ -2 జరిగింది. ఈ రెండు సంఘటనల వెనుక రాజకీయ నేపథ్యం వేరుగా ఉంది.
1974లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పాలన నడుస్తోంది. అదే 98కి వచ్చేసరికి అటల్ బిహారి వాజ్ పేయ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పట్లో బీజెపీ నేతృత్వంలోని ఎన్ డిఏ పాలన సాగుతోంది.
అణుపాటవ పరీక్ష దగ్గరకి వస్తే, 1974నాటిది శాంతియుత అణు విస్ఫోటనంగా రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు చెబుతుంటారు. దీన్నే PNE అంటారు. అయితే ఈ వాదనలను కొట్టిపారేస్తూ, అనేక సందేహాలు వెలుబుచ్చినవారూ ఉన్నారు. ఇది కచ్చితంగా న్యూక్లియార్ టెస్టేనంటూ ప్రచారం జోరుగా సాగింది. 1998కి వచ్చేసరికి బీజేపీవాళ్లు, శాస్త్రవేత్తలు కూడా దీన్ని ఓ అణ్వాయుధ పరీక్షగానే చాటింపు వేశారు. ఈ కారణంగా బీజేపీకి పొలిటికల్ మైలేజ్ రావడంతోపాటుగా, అణ్వాయుధ పాలసీలో మార్పులకు దారితీసింది.
అణ్వాయుధాలు ఉన్నాయంటూ శత్రుదేశాలను భయపెట్టడంవేరు, నిజంగా వాటిని సమకూర్చుకోవడంవేరు. రెండోది అత్యంత ప్రమాదమైనదిగా చెప్పుకోవచ్చు. భారత్, పాకిస్తాన్ వంటి దేశాల మధ్య దాయాదుల పోరు సాగుతున్నప్పుడూ అణ్వాయుధాలు నిజంగానే సమకూర్చుకుంటే అది మహా విపత్తులకు దారితీయవచ్చు. ప్రపంచంలోనే జనాభాలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ లో అణువిస్ఫోటనలు జరిగితే, దాని ప్రభావం అత్యంత భయంకరంగానే ఉంటుంది. అపార జననష్టం సంభవించవచ్చు.
విద్యుత్ అవసరాలు తీర్చుకోవడం కోసం మనదేశం కూడా న్యూక్లియర్ పవర్ మీద ఎక్కువగా ఆధారపడాలనుకుంటోంది. మరో పక్క భారత్ – అమెరికా దేశాల మధ్య పౌర అణు ఇంధన సహకార ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు కూడా ఇటువంటి సహకారం అందివ్వడానికి ముందుకు వచ్చాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అణు ఇంధనం విషయంలో అనుమానాలు మాత్రం వీడిపోలేదు.
అణు `రక్షణ’ ఉందా?
మన దేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ప్రమాదరహితంగా ఉన్నాయా…? అని ప్రశ్నించుకుంటే , కచ్చితంగా లేవనే సమాధానం వస్తుంది. ఓసారి గతంలో సంభవించిన ప్రమాదాల వివరాలు…
- 1987 – తమిళనాడు- కల్పాకంలో ప్రమాదం. రెండేళ్లపాటు మూసేయాల్సి వచ్చింది.
- మహారాష్ట్రలోని తారాపూర్ అణువిద్యుత్ కేంద్రంలో 1989, 1992, 1993లో మొత్తం మూడుసార్లు ప్రమాదాలు జరిగాయి.
1945లో జపాన్ లో జరిగిన అణుబాంబుల దాడి సంగతి కాసేపు పక్కన పెడదాం. మరి ఈ మధ్యనే సునామీ, పెనుభూకంపంతో జపాన్ లో అణు రియాక్టర్లు పేలిపోయి, అణుధార్మికత వ్యాపించడం మాటేమిటి? జపాను దుర్ఘటన మరో హెచ్చరిక కాదా…? అలాంటప్పుడు మన దేశం అణు ఇంధనంపై ఆలోచించడమేమిటి? అణుశక్తి కాకుండా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఉన్నప్పుడు ఏరికోరి విషసర్పాన్ని ఇంటికి ఆహ్వానించడం మంచిదేనా…?
జపాన్ లో ఈ మధ్యనే సునామీ, భూకంపం విరుచుకుపడటంతో అణురియాక్టర్లకు అపార నష్టం వాటిల్లింది. హెచ్చుమోతాదులో అణుధార్మికత వెలువడింది. దీంతో జపాన్ వాసులు గడగడలాడారు. వాటిని మళ్ళీ దారిలోకి తెచ్చుకోవడానికి రేయింబవళ్లు కష్టపడాల్సివచ్చింది.
జపాన్ సంఘటనతో ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. మరీ ముఖ్యంగా అణు ఇంధన శక్తిని సమకూర్చుకోవాలని తపిస్తున్న దేశాలు పునరాలోచనలో పడ్డాయి. అభివృద్ధి చెందిన జర్మనీ వంటి దేశాలే అణుఇంధన శక్తి వినియోగంపై పునరాలోచనలో పడినప్పుడు మనం ఆ దిశగా ఎందుకు ఆలోచించకూడదు..?
పౌర అణు ఇంధనంతో మనదేశం సస్యశ్యామలమవుతోందని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సహా అనేక మంది పెద్దలు భావించిఉండవచ్చు. అందుకే అమెరికాతో అణు ఇంధన ఒప్పందం విషయంలో అంతగా పట్టుపట్టి ఉండవచ్చు. అయితే, ఈ మధ్యనే జపాన్ లో సంభవించిన అణు విపత్తు చూస్తుంటే, అణు ఇంధన విషయంలో ఆచితూచి అడుగువేయాలేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
జపాన్ దుర్ఘనటన ఓ హెచ్చరికలా మారింది. అణు ఇంధనం చేసే మేలుకంటే, కీడే ఎక్కువన్న అభిప్రాయం వినబడుతోంది.
- ప్రాణహాని తప్పదు
- పర్యావరణానికి పెను ముప్పు తప్పదు
- ఆర్థికంగా దేశం కుంటుపడుతుంది
- పర్యావరణానికి పెను ముప్పు తప్పదు
- ఆర్థికంగా దేశం కుంటుపడుతుంది
న్యూక్లియర్ ప్లాంట్ లో ఒకవేళ విపత్తు సంభవిస్తే, అది చాలా భయంకరంగానే ఉంటుంది. విషాద ఛాయలు తరతరాలుగా వెన్నంటే ఉంటాయి. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన ఇంధన వనరుగా చెప్పుకోవాలి.
జపాన్ లో తలెత్తిన అణు సంక్షోభం వంటిది మనదేశంలో సంభవిస్తే, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగల సాంకేతిక పరిజ్ఞానం మనవద్ద ఉన్నదా…?
మన ప్రభుత్వాలు అణుఇంధనం వల్ల కలిగే లాభాలు చూస్తూ లొట్టలేస్తున్నారేగానీ, వాటి వెన్నంటేఉన్న ప్రమాదాలను గమనించలేకపోతున్నాయా??
అందుకే పర్యావరణ ప్రియులంతా, ప్రమాదకరమైన ఇంధన వనరులను బహిష్కరించాలని కోరుతున్నారు. ఇంధన వనరులను పునరద్ధరించాలి. అప్పుడే అణుఇంధనం వంటి వాటి జోలికిపోకుండా ఉండగలము.
ప్రమాదరహిత ఇంధన వనరులను పెంచుకోవడానికి ఖర్చు ఎక్కువైనప్పటికీ వాటిని ప్రోత్సహించాలి. ఇలాంటి ప్రయత్నాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.
బొగ్గు, గ్యాస్ వంటి ఇంధనాలను మినహాయిస్తే, న్యూక్లియర్ పవర్ కు ప్రత్యామ్నాయాలు ఏమిటో తెలుసుకుని వాటిని ప్రోత్సహించాలి.

- ప్రత్యామ్నాయ ఇంధన వనరులు
- సోలార్ ఎనర్జీ
- పవన విద్యుత్
- బయోమాస్ ఎనర్జీ
- సోలార్ ఎనర్జీ
- పవన విద్యుత్
- బయోమాస్ ఎనర్జీ
ఈ మూడింటిలోనూ సోలార్ ఎనర్జీనే మనదేశానికి మంచిదని నిపుణులు చెబుతూనే ఉన్నారు.
మరి మనదేశం ఏమేరకు సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుంటందో తెలిస్తే, నిరాశనిస్పృహలు అలుముకోవడం ఖాయం. మనదేశంలో వినియోగంలో ఉన్న మొత్తం ఇంధన శక్తిలో సోలార్ ఎనర్జీ వాటా కేవలం ఒక్క శాతం మాత్రమే. అణుఇంధన శక్తికంటే చవకగానే పవన విద్యుత్ నీ, అలాగే, సోలార్ ఎనర్జీని పొందవచ్చు.

మిగతా 3వ భాగంలో
తుర్లపాటి నాగభూషణ రావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి