ప్రధానిగా రాహుల్ ఓకే..!


దేశంలో ఆసక్తికరంగా రాహుల్ గాంధీని ప్రధాని కావాలని కోరుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. సిఎన్ ఎన్ ఐబిఎన్ నిర్వహించిన ఒక సర్వే ఈ విశేషాన్ని వెల్లడించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ మెల్లగా రాహుల్ గాంధీ కన్నా వెనుకబడి పోయారు.ఇక ప్రదాని పదవిని గతంలో ఆశించిన బిజెపి అగ్ర నేత ఎల్.కె. అద్వాని కూడా బాగా వెనుకంజలో ఉన్నారు. రాహుల్ గాందీ ప్రధాని కావాలని రెండువేల నాలుగులో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే కోరితే, అది రెండువేల ఆరునాటికి రెండు శాతం,రెండు వేల తొమ్మిది నాటికి ఆరు శాతానికి చేరుకుని ఇప్పుడు రెండువేల పదకుండు ఆ శాతం పదకుండుగా ఉండడం విశేషం.ప్రధాని మన్మోహన్ సింగ్ కు రెండువేల ఆరులో పన్నెండు శాతం మద్దతు లభించగా, అంతకుముందు రెండువేల నాలుగులో కేవలం ఒక్క శాతం మద్దతు ఉన్నప్పట్టికి ఆయన ప్రధాని అయ్యారు. రెండువేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ ప్రధాని కావాలనుకున్నవారి సంఖ్య పద్దెనిమిది శాతంగా ఉంది. అప్పట్లో ఇతర నాయకులతో పోల్చితే ఆయనకే ఎక్కువ ఆదరణ లభించింది. కారణం ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆ సంఖ్య పది శాతానికి పడిపోయింది.సోనియాగాందీకి 1999లో లో ఇరవైఐదు శాతం, రెండువేల నాలుగులో ఇరవై ఆరు శాతం, రెండువేల ఆరులో ఇరవై రెండు శాతం ఉండగా, రెండువేల తొమ్మిదిలో పదహారు శాతానికి పడిపోయి, అది ఇప్పుడు పదిశాతానికే చేరింది.గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి ప్రస్తుతం ఐదు శాతం మద్దతే లభిస్తోంది. బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానికి రెండువేల తొ్మ్మిదిలో అత్యధికంగా పదిహేను శాతం మద్దతు లభించగా, ఇప్పుడు అది నాలుగు శాతానికి పడిపోయింది. అద్వానికన్నా మోడినే ముందంజలో ఉన్నారు.మాయావతికి మూడు శాతం మందే ఓటు వేశారు. సుమారు ముప్పై తొమ్మిది వేల మందిని దేశవ్యాప్తంగా ప్రశ్నించిన మీదట ఈ సర్వే ఫలితాలను ప్రకటించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!