హ్యాపీ బ‌ర్త్‌డే టు ప్రిన్స్‌..


తెలుగు సినిమా చ‌రిత్రలో త‌న‌కంటూ ఒక ప్రత్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో ప్రిన్స్ మ‌హేష్‌ బాబు. చిన్నత‌నం ఉండే న‌ట‌న‌లో త‌న‌దైన ప్రత్యేక‌త‌ని చాటుకుంటూ నేడు స్టార్ హీరోగా కొన‌సాగుతుండ‌డం అన్నది మామూలు విష‌యం కాదు. త‌న తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ న‌ట వార‌సుడిగా ఆయ‌న పేరుని నిల‌బెట్ట డ‌మే కాకుండా త‌న‌దైన ప్రత్యేక మేన‌రిజంతో కోట్లాది మంది అభిమానుల‌ని సొంతం చేసుకున్న ఘ‌న‌త ప్రిన్స్ మ‌హేష్‌బాబుది. రాజ‌కుమారుడు సినిమాతో హీరోగా రంగ‌ప్రవేశం చేసి ఖ‌లేజా వ‌ర‌కు కొన‌సాగిన ఆయ‌న ప్రస్థానంలో అత్యధికంగా హిట్ సినిమాలే నిలిచాయంటే ఆయ‌న స్టామినా ఏంటో తెలుస్తుంది. వార‌స‌త్వం అన్నది కేవ‌లం సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ కావ‌డానికి మాత్రమే ప‌నికి వ‌స్తుంది, ఆ త‌ర్వాత త‌మ‌లోని స్టామినా ఉంటేనే స్టార్‌గా నిల‌దొక్కుతార‌ని మ‌హేష్‌బాబు నిరూపిస్తాడు. ఆర‌డుగుల పొడ‌వు, ఎర్రగా నిగ‌నిగ‌ లాడుతూ క‌నిపించే మ‌హేష్ త‌న న‌ట‌న‌తో కూడా ప్రేక్షకుల‌ని మంత్రముగ్దుల‌ని చేస్తుండడం విశేషం.ఈ మ‌ధ్య మ‌హేష్ సినిమా రిలీజ్ కావ‌డానికి సంవ‌త్సరాల స‌మ‌యం ప‌డుతుంది. రెండు మూడేళ్ళకు గానీ ఒక సినిమా రిలీజ్ కాని ప‌రిస్థితి నెల‌కొంది. దీనికి మ‌హేష్‌బాబు కూడా బాధ్యుడు కాబ‌ట్టి ఈ పుట్టిన‌రోజు సంద్భంగానైనా ఏడాదికి రెండుసినిమాల్లో న‌టిస్తాన‌ని త‌న అభిమానుల‌కి హామీ ఇస్తే బావుంటుంది. సంవ‌త్సరాల త‌ర‌బ‌డి షూటింగ్ జ‌రుపుకుని తీరా రిలీజ‌య్యాక రిజ‌ల్ట్ వీక్‌గా ఉంటుండంతో అటు అభిమాను ల‌తో పాటు ఇటు సినీ ప‌రిశ్రమ కూడా న‌ష్టపోతుంది కాబ‌ట్టి ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఇక‌నుండ‌యినా త‌న అభిమానుల‌కి డిస‌ప్పాయింట్ చేయ‌కుండా వ‌రుస సినిమాల‌తో విజ‌య‌ప‌థంలో దూసుకుపోవాల‌ని మ‌న‌సారా కోరుకుంటూ 5amnews.com మ‌హేష్‌బాబుకి హార్థిక జ‌న్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!