తెలంగాణ జిల్లాల్లో బంద్ ప్రభావం


తెలంగాణ జిల్లాల్లో బంద్ ప్రభావం క‌నిపిస్తోంది. అక్కడక్కడా కొన్ని చెదురు ముదురు సంఘ‌ట‌న‌ల‌తో బంద్ కొన‌సాగుతోంది. తెలంగాణ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు బుధవారం తెలంగాణలోని పది జిల్లాల్లో బస్సు డిపోలకు తాళాలు వేశారు.  14ఎఫ్ రద్దు చేస్తున్నామని కేంద్రం నుండి సంకేతాలు వచ్చినప్పటికీ అధికారికంగా ఉత్తర్వులు బయటకు వచ్చే వరకు తమ నిరసన తెలియజేస్తామని అందులో భాగంగానే బందును కొనసాగిస్తున్నామని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అన్నారు.
కాగా బందు కారణంగా వరంగల్ జిల్లాలో 800, నల్గొండ జిల్లాలో 750, మెదక్ జిల్లాలో 600, ఖమ్మంలో 624, కరీంనగర్‌లో 700కు పైగా, అదిలాబాదులో 600కు పైగా, నిజామాబాదులో 629, మహబూబ్ నగర్‌లో 750కి పైగా బస్సులు డిపోల్లో నిలిచి పోయాయని సమాచారం. బయటకు వచ్చిన బస్సులను విద్యార్థులు అడ్డుకొని టైర్లలో గాలులు తీసేస్తున్నారు. మహబూబ్ నగర్‌లోని షాద్ నగర్‌లో రెండు, హైదరాబాదులోని వనస్థలిపురంలో నాలుగు, జగద్గిరిగుట్ట వద్ద రెండు బస్సులపై తెలంగాణవాదులు దాడి చేసి బస్సులను ధ్వంసం చేశారు. కాగా కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ కారణంగా నిత్యం రద్దీగా ఉండే మహాత్మా గాంధీ, జూబ్లీ బస్ స్టేషన్ పూర్తిగా బోసి పోయాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!