జగన్ కు కష్టకాలం

జగన్ ఆస్తులపైన, ఎమార్ అక్రమాలపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని హైకోర్టు ఈరోజు సీబీఐను ఆదేశించింది. దీంతో జగన్ పై వస్తున్న ఆరోపణలపై కూడా పూర్తి స్థాయి విచారణ జరగడం ఖాయం. అంటే జగన్ కు కష్టాలు వచ్చినట్టే... నో డౌట్... 
   పూర్తి స్థాయి విచారణ జరిపితేనేకానీ వాస్తవాలు వెలుగురావని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పేసింది. పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలుసుకోవాల్సిందేనని కూడా హైకోర్టు భావించింది. నిజానిజాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉన్నదని న్యాయస్థానం భావించింది. దేశీయ, విదేశీయ కంపెనీల పాత్ర ఏమిటో కూడా తేలాల్సి ఉన్నదని హైకోర్టు భావించింది. అలా జరిగినప్పుడే పెట్టుబడుల మూలాలు వెలుగుచూస్తాయని న్యాయస్థానం పేర్కొంది. జగన్ ఆస్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరపాలని చాలా స్పష్టంగా హైకోర్టు తేల్చిచెప్పింది. 
 కాగా, జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు తీర్పును గౌరవిస్తామంటూ ఒక ప్రకటన చేసింది.  అయితేజగన్ మరి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కుంటారు....? తన పార్టీని ఎలా పటిష్టపరుస్తారు...? ఈ అంశాలపై ఇప్పుడు జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!