అష్టదిగ్బంధంలో అమెరికా (Part-1)
అమెరికా సెనెట్ రుణపరిమితి బిల్లుకు ఆమోదం తెలిపినంతమాత్రాన ఆర్థిక అష్టది గ్బంధం నుంచి అమెరికా బయటపడిందనే అనుకోవాలా…? లేదంటే, ప్రస్తుతానికి బలహీనపడిన పెను తుపానుగానే భావించాలా? డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య కీలక బిల్లు విషయంలో ఏకాభిప్రాయం కుదిరినమంతమాత్రాన ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా మెరుగైపోతుందా…? అంకుల్ శామ్ దివాళాతీస్తే యావత్ ప్రపంచం కుదేలవు తుందన్న భయాలు ఇక పోయినట్టేనా…? వాస్తవ చిత్రం ఏమిటి…? ఒక వేళ మన దేశానికే ఇలాంటి ఆర్థిక ముప్పు వస్తే, మనం తట్టుకోగలమా? అప్పుడు మనదేశాన్ని ఏ శక్తి రక్షిస్తోంది…?
అప్పు చేయడం కొందరికి సరదా కావచ్చు.
కానీ చాలామంది అవసరం కోసమే అప్పులు చేస్తుంటారు.
కానీ చాలామంది అవసరం కోసమే అప్పులు చేస్తుంటారు.
అయితే, అవసరం తీరిన తరువాత అప్పు తీర్చలేని పరిస్థితి వస్తే మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సిందే. ఒకసారి అప్పుల చక్రంలో కూరుకుపోతే ఇక అంతే సంగతులు. ఒక వ్యక్తికైనా, దేశానికైనా ఇదే ఆర్థిక సూత్రం వర్తిస్తుంది. ప్రపంచదేశాలకే పెద్దన్న లాంటి అమెరికానే ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. దివాళాతీసే పరిస్థితిని కోరితెచ్చుకుంది. అందరికీ శకునాలు చెప్పే బల్లి తానే కుడితితొట్టిలో పడినట్టుగా మారింది అమెరికా పరిస్థితి. ప్రభుత్వానికి సర్వాధికారులుంటాయనుకుంటే పొరపాటే. విచ్చలవిడిగా ఖర్చుచేసి ఖజానాను ఖాళీ చేస్తే ఇదిగో, ఇప్పుడు అమెరికా ఎదుర్కుంటున్న సమస్యలే ఎదురవుతాయి. ఫస్ట్ తారీఖు వచ్చిందంటే చాలు, చెల్లింపుల మేర డబ్బుల కట్టలు ఖజానా నుంచి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఖజానా ఖాళీ అయితే ఏం చేస్తాం…? ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా ఎదుర్కుంటున్నది ఇదే. మరి ఈ సంక్షోభం నుంచి అమెరికా ఎలా తప్పించుకోబోతున్నది? ప్రస్తుతానికి రుణపరిమితిని పెంచేసుకుని గండం గట్టెక్కిందని ఊపిరిపీల్చేసుకున్నప్పటికీ, రాబోయే కష్టకాలాన్ని ఎలా ఎదుర్కోబోతున్నదన్నదే అసలు ప్రశ్న. ప్రపంచాన్నే తన గుప్పెట్లో ఉంచేసుకున్నానంటూ ఎంతో గర్వంగా చెప్పుకునే అమెరికా పెద్దరికాన్ని ఈ సంక్షోభం సవాల్ చేస్తూనేఉంది… అమెరికాలో అసలేం జరుగుతోంది..? పైకి రోగం కనిపించకపోయినా, లోపల నరాలు చిట్టిపోతున్న టెన్షన్… భవిష్యత్తు అంధకారం అయిపోతుందేమోనన్న దిగులు. తెల్లవారితే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న భయం… ఎస్…అమెరికా పౌరుల పరిస్థితి ఇదే.
ప్రపంచదేశాల్లో చాలామటుకు ఏదో ఒక రూపంలో అగ్రరాజ్యమైన అమెరికాపై ఆధారపడే ఉన్నాయి. వాషింగ్టన్ లో ట్విన్ టవర్స్ కూలితే యావత్ ప్రపంచం తల్లడిల్లిపోయింది. పెనుతుపానులు విరుచుకుపడితే మిగతా దేశాలు వణికిపోయాయి. వైట్ హౌస్ ని బుష్ వదిలిపెట్టినా, ఒబామా ఎంటరైనా అందరిలోనూ ఆసక్తే… ఎందుకంటే, యావత్ ప్రపంచాన్నీ అమెరికా గుప్పెట్లో పెట్టుకోవడమే దీనికి కారణం.
అమెరికాలో ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం, ఆదేశ ప్రభుత్వం అత్యధికంగా 14లక్షల 30వేల కోట్ల డాలర్ల మేరకు మాత్రమే రుణాన్ని మార్కెట్ నుంచి సమీకరించుకోవచ్చు. కానీ ఈ పరిధిని అమెరికా ప్రభుత్వం మూడు నెలల కిందటే దాటేసింది.
మరి, ఈ రోగానికి మందేమిటి…? అప్పుచేయాల్సిందేనా… అలా చేయాలంటే రుణపరిమితిని పెంచాల్సిందే. అయితే, ఇందుకు అమెరికా చట్ట సభల ఆమోదం కావాలి. అసలు సమస్య ఇక్కడే ఉంది. ఈ విషయంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్రమైన విభేధాలున్నాయి. ఈ కారణంగానే సమస్య చివరివరకు తెగకుండా సస్పెన్స్ డ్రామాగా నడిచింది. మరో రోజులో సెనెట్ లో బిల్లు రాబోతుందనగా, అధికార డెమోక్రాట్లు, విపక్ష రిపబ్లికన్లు ఒక ఒప్పందానికి వచ్చినట్టు ఒబామా చల్లగా చెప్పారు. దీంతో అమెరికానే కాదు, యావత్ ప్రపంచదేశాలు ఊపిరిపీల్చుకున్నాయి.

(మిగతా రెండవ భాగంలో)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి