ప‌ద్దతి ప్రకారం ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌



ఈ మ‌ధ్య తెలుగు సినిమా స్టార్ హీరోలు ఓ ప‌ద్దతి ప్రకారం వెళుతున్నట్టు క‌నిపిస్తోంది. ఒక్కో సినిమాకి రెండేసి మూడేసి సంవ‌త్సరాలు తీసుకోవ‌డం, తీరా ఆ చిత్రం రిలీజ‌య్యాక బాక్సాఫీస్ ద‌గ్గర బోల్తా ప‌డ‌డంతో స్టార్ హీరోలు డైలమాలో ప‌డిపోయారు. త‌మ అభిమానులు ఎంతో ఆశ‌గా త‌మ చిత్రాల కోసం వెయిట్ చేస్తుంటే ఎక్కువ టైం తీసుకుని ఎంతో పెద్ద హిట్ చిత్రం వ‌స్తుందేమో అన్న ఎక్స్‌పెక్టేష‌న్స్ అధికం చేసి తీరా సినిమా రిలీజ‌య్యాక త‌మ అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌వుతుండడంతో హీరోలు మేల్కొన్నారు. త‌మ నిర్లక్ష్యం వ‌ల్ల అభిమానులు ఆందోళ‌న చెంద‌డం గుర్తించారు. అందుకే ఏడాదికి రెండు సినిమాలు రిలీజ‌య్యే విధంగా ప‌క్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నారు. ఆ కోవ‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ ముందున్నాడు. కొమరం పులి తర్వాత పద్దతి మార్చుకుని ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘కాళి’ కూడా దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చింది. తమిళ డైరెక్టర్ విష్ణు వర్థన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్ ఒక డిఫరెంట్ షేడ్ లో చూపించబోతున్నాడు. ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే హరీష్ శంకర్ డైరెక్షన్ లో గబ్బర్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటాడు పవన్ కళ్యాణ్. ఈ చిత్రం షూటింగ్ ను కేరళలో ప్రారంభించాలని నిర్ణయించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!