టీమిండియా వ‌న్డే జ‌ట్టు ఖ‌రారు


ఇంగ్లాండుతో జరిగే వన్డే మ్యాచులకు సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. జ‌ట్టులోని స‌భ్యులు వీరే..
జట్టు – ఎంఎస్ ధోనీ (కెప్టెన్), గౌతం గంభీర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, విరేందర్ సెహ్వాగ్ (వైస్ కెప్టెన్), సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా, ప్రవీణ్ కుమార్, జహీర్ ఖాన్, ఆర్ ఆశ్విన్, మునాఫ్ పటేల్, ఇషాంత్ శర్మ, వినయ్ కుమార్, అమిత్ మిశ్రా, పార్ధివ్ పటేల్.
రెండేళ్ల తర్వాత రాహుల్ ద్రావిడ్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, యువరాజ్ సింగ్, శ్రీశాంత్‌లకు వన్జే జట్టులో స్థానం లభించలేదు. వినయ్ కుమార్‌కు చోటు దక్కింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఇంగ్లాండుతో వన్డే సిరీస్ ప్రారంభమవుతోంది. హర్భజన్ స్థానంలో అమిత్ మిశ్రా, అశ్విన్ జట్టులోకి వచ్చారు.
హర్భజన్ సింగ్ ఇంగ్లాండుతో జరిగిన టెస్టు మ్యాచులో గాయపడ్డాడు. బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మకు చోటు దక్కింది. సెహ్వాగ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ధోనీ నాయకత్వంలోని 15 మంది సభ్యులతో జట్టును శ్రీకాంత్ నేతృతంలోని సెలెక్షన్ కమిటీ శనివారం ఎంపిక చేసింది. పార్థివ్ పటేల్ కూడా జట్టులోకి వచ్చాడు. టెస్ట్‌ల్లో భార‌త్ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత వండే మ్యాచుల్లో అయినా త‌న స‌త్తా చాటాల‌ని భార‌త అభిమానులు ఆశ‌ప‌డుతున్నారు. మ‌రి ఈ టీం.. అభిమానుల ఆశ‌లు గ‌ల్లంతు చేస్తాయా.. నిల‌బెడ‌తాయా అన్నది చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!