అన్నాకు దీక్షా శిబిరం ఆఫర్..
జన లోక్ పాల్ బిల్లు కోసం ఈ నెల 16 నుంచి దీక్షకు దిగేందుకు సామాజిక కార్యకర్త, పౌరసమాజం ప్రతినిధి అన్నాహజారే సిద్ధమవుతున్నారు. హజారేతో పాటు పౌరసమాజం ప్రతినిధులు ఎంత చెప్పినా.. కేంద్రం తయారుచేసిన లోక్ పాల్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ప్రధానిని బిల్లు పరిధిలోకి తీసుకురాకుండానే లోక్ సభలో ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టింది. అయితే దీనిపై అన్నా హజారే మండిపడ్డారు. లోక్ పాల్ బిల్లు ప్రతులను తగులబెట్టారు. ఆగస్టు 16 నుంచి దీక్ష తప్పదని హెచ్చరించారు. అయితే అన్నా హెచ్చరికను దృష్టిలో పెట్టుకుని ఆయన దీక్షకు ఆటంకాలు సృష్టిస్తోంది కేంద్ర ప్రభుత్వం. జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసేందుకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తేల్చిచెప్పారు. స్థలం ముఖ్యం కాదు.. లక్ష్యం ముఖ్యమని ప్రకటించిన అన్నా.. దీక్షకు రెడీ అవుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులపై అన్నాహజారేకు బీజేపీ నేత.. వరుణ్ గాంధీ ఓ ప్రతిపాదన చేశారు. తమ దీక్షకు ఢిల్లీలోని తన ఇంటిని ఉపయోగించుకోవచ్చని.. వరుణ్ గాంధీ సూచించారు. అయితే అప్పట్లో అన్నా హజారే దీక్షకు.. మత తత్వ పార్టీల మద్దతుందనే ఆరోపణలు చేసింది కేంద్రంలోని కొందరు మంత్రులు. అప్పట్లో ఈ ఆరోపణలపై అన్నాహజారే మండిపడ్డారు. తన దీక్షకు మత తత్వ పార్టీల మద్ధతుపై ఒక్క ఆధారమైనా చూపించాలని ఆయన వారిని డిమాండ్ చేశారు. అయితే మళ్లీ వరుణ్ గాంధీ ప్రతిపాదనపై అన్నా ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి