నిశ్శబ్ద ప్రళయం (Part3)
మన సంగతేంటీ?
మనరాష్ట్రానికి పొరుగునేఉన్న మహారాష్ట్రలోని జైతాపూర్ లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటవుతోంది. మన రాష్ట్రంలోని కొవ్వాడ మాదిరిగానే అక్కడి స్థానికులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా పనులు మాత్రం ఆగడంలేదు. ఈ వాలకం చూస్తుంటే, పాలకులకు ప్రజల ఆరోగ్యం కంటే, అంతర్జాతీయ ఒప్పందాలపైనే ఎక్కువ మక్కువ ఉన్నట్టు కనబడుతోంది.
మనరాష్ట్రంలోని అణు విద్యుత్ కేంద్రాల గురించి ముచ్చటించుకునేముందు, పొరుగునే ఉన్న మహారాష్ట్ర లోని జైతాపూర్ ప్లాంట్ గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే. నిర్మాణం పూర్తి అయితే, ప్రపంచంలోని అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్స్ లో ఇదొకటిగా గుర్తింపుపొందుతుంది. ఈ ప్లాంట్ లో ఆరు రియాక్టర్లు ఉంటాయి. 9,600 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం కొవ్వాడ వద్ద ఏర్పాటు చేద్దామనుకుంటున్న మెగా న్యూక్లియర్ ప్లాంట్ పట్ల స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వం అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టాలనుకుం టున్నది.
కొవ్వాడ ప్రాంతం వద్ద పదివేల మెగావాట్ల న్యూక్లియర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం రెండువేల ఎకకారల స్థలంలో లక్ష కోట్ల ఖర్చుతో ఈ భారీ ప్లాంట్ ను ఏర్పాటుచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
అయితే, కొవ్వాడ స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జపాన్ తరహాలో విపత్తు సంభవిస్తే పచ్చటి పొలలాతో ఉన్న శ్రీకాకుళం జిల్లా సర్వనాశనం అయిపోతుందని వారు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతిపాదిత అణువిద్యుత్ కేంద్రాలు
- శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ
- గుంటూరు జిల్లా నిజాంపట్నం
- కడప జిల్లా పులివెందుల
- విశాఖ జిల్లా నక్కపల్లి
- గుంటూరు జిల్లా నిజాంపట్నం
- కడప జిల్లా పులివెందుల
- విశాఖ జిల్లా నక్కపల్లి
అణువిద్యుత్ ఎంతటి ప్రమాదకరమో జపాన్ ఘటన మరోమారు చాటిచెప్పింది. అయితే, మన రాష్ట్ర వాసులు ఈ తరహా విద్యుత్ కేంద్రాలను మొదటి నుంచీ ఎదుర్కుంటూనే ఉన్నారు. అణువిద్యుత్ పార్క్ లకోసమో, లేదా అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకోసమో ప్రయత్నాలు ప్రారంభించినప్పుడల్లా స్థానికులు అడ్డుతగులుతూనే ఉన్నారు. ఇప్పుడు జపాన్ దుర్ఘటన తోడు కావడంతో అణువిద్యుత్ కోసం భారీ వ్యూహాలను రచించిన ప్రభుత్వం పునరాలోచనలో పడాల్సి వస్తున్నది.
మన రాష్ట్రంలో యురేనియం నిల్వలు కూడా అపారంగానే ఉన్నాయి. ప్రపంచంలో యురేనియం నిల్వలు అపారంగా ఉన్న టాప్ 20 దేశాల్లో మనదేశం కూడా చేరిపోయింది. కడపజిల్లా పులివెందుల నియోజక వర్గంలోని పది గ్రామాల్లో యురేనియం నిల్వలకోసం 2,200 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. యురేనియం వెలికతీతతో ఎలాంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడాతాయోనని స్థానికులు కలవరపడుతున్నారు.
మన రాష్ట్రంలో యురేనియం నిల్వలు కూడా అపారంగానే ఉన్నాయి. ప్రపంచంలో యురేనియం నిల్వలు అపారంగా ఉన్న టాప్ 20 దేశాల్లో మనదేశం కూడా చేరిపోయింది. కడపజిల్లా పులివెందుల నియోజక వర్గంలోని పది గ్రామాల్లో యురేనియం నిల్వలకోసం 2,200 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. యురేనియం వెలికతీతతో ఎలాంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడాతాయోనని స్థానికులు కలవరపడుతున్నారు.
అణువిద్యుత్ వాడకంలోని ప్రయోజనాల గురించి ఊదరగొట్టే నాయకులు, ప్రమాదాలు తలెత్తితే ఎదుర్కునే సామర్థ్యం మనకు ఉన్నదా అని ఆలోచించడంలేదు. ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా పెద్దపెట్టున చర్యలు తీసుకోవడంలేదు. అణు ప్రమాదల పట్ల చైతన్యం లేకపోతే, చిన్న ప్రమాదం సంభవించినా అపార ప్రాణనష్టం జరిగే అవకాశాలే ఎక్కువ.
ప్రతి అణు పార్కుల మధ్య 55 కిలోమీటర్ల దూరం ఉంటుందని ఒక పక్క ప్రభుత్వం లెక్కలు జోకొడుతున్నా, వాస్తవమేమిటంటే, అణు ప్రమాదమంటూ సంభవిస్తే, దాని దుష్ఫలితాలు కనీసం 150 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. మరి అణు కేంద్రాల విషయంలో మన ప్రభుత్వాలను ఎలా నమ్మగలం…? తూర్పు- పడమర తీరప్రాంతమంతా బాంబులను పేర్చినట్టు అణు కర్మాగారాలను నెలకొల్పడం ప్రజాశ్రేయస్సుకా…లేక వినాశనానికా…? ఇప్పుడిప్పుడే అభివృద్ధిచెందుతున్న దేశం పాతికేళ్ల కిందటి టెక్నాలజీతో ఎనిమిదిన్నర లక్షల కోట్లతో అణు రియాక్టర్లను నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రశ్నలకు కూడా ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి