బాబు దృష్టి కేంద్ర రాజకీయాల వైపు
తెలుగుదేశం అధినేత,రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మళ్లీ జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని బావిస్తున్నారా?చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి ప్రస్తుతతం ఢి్ల్లీ పర్యటించడంలోని ఆంతర్యం ఇదేనా అన్న చర్చ జరుగుతోంది. మంగళవారం ఉదయం చంద్రబాబు డి్ల్లీ వెళ్లారు.లోక్ పాల్ బిల్లు, రాష్ట్రానికి సంబందించిన క్రాప్ హాలిడే వంటి సమస్యలపై జాతీయ నాయకులతో చర్చలు జరపడానికి వచ్చానని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి ఈ సమస్యలపై ప్రత్యేకించి ఇప్పుడు చంద్రబాబు మాట్లాడ వలసింది కొత్తగా ఏమీలేదు. ఎందుకంటే లోక్ పాల్ బిల్లుపై ఇప్పటికే చంద్రబాబు తన అభిప్రాయం తెలియచేశారు. అలాగే బాబా రామ్ దేవ్ కు కూడా అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో లో మద్తతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకుడు అన్నా హజారేని కూడా చంద్రబాబు కలుస్తారో చూడాల్సి ఉంది. అన్నా హజారే ఈ నెల పదహారో తేదీనుంచి దీక్షకు దిగనున్న నేపధ్యంలో డిల్లీలో ఆయన అందుబాటులో ఉంటే చంద్రబాబు కలిసి సంఘీభావం ప్రకటించవచ్చు. రాష్ట్రంలో నెలకొన్న ప్రాంతీయ ఉద్యమాల నేపధ్యంలో జాతీయ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం, జాతీయ రాజకీయ పార్టీలు,జాతీయ నేతలతో మంతనాలు జరపడం ద్వారా దేశం అంతటి దృష్టిని ఆకర్షించవచ్చు. తద్వారా కొంత రిలీఫ్ కూడా ఆయనకు లభిస్తుంది. డిల్లీలో సిపిఎం నేత ప్రకాష్ కరత్ ను చంద్రబాబు కలుసుకున్నారు. మరి కొందరు ప్రముఖులను కూడా ఆయన కలుస్తారు. రెండు రోజులపాటు చంద్రబాబు పర్యటన సాగుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి