సినిమా సంస్థల‌పై దాడులు


సినిమాటోగ్రఫీ సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని పలు సినినిర్మాణ సంస్థలపై ఐటి అధికారులు దాడులు జరిపారు. ఈ సినిమాటోగ్రపీ చట్టం ప్రకారం సినిమా నిర్మాణం, యాడ్స్ వంటివాటిపై నిర్మాణసంస్థలు తప్పనిసరిగా సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. అయితే కొంతకాలంగా సినీనిర్మాణ సంస్థలు సినిమాలు తీసిన తర్వాత చాలాతక్కువగా లాభాలు చూపించడం లేదా నష్టాల్లో ఉన్నాయని చూపెట్టడం ద్వారా ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటి అధికారులు సినిమా రంగంను టార్గెట్ చేసి పలు నిర్మాణ సంస్థలపై దాడులు జరిపారు. ఇందులో ముఖ్యంగా ప్రముఖ నిర్మాత , చిరంజీవి బామ్మర్ధి అయిన అల్లుఅరవింద్ కు చెందిన గీతాఆర్ట్స్, దిల్ రాజు కు చెందిన వెంకటేశ్వర ఫిలింస్ , బెల్లంకొండసురేష్ కు చెందిన శ్రీ సాయిగణేష్ ,మరో ప్రముఖుడిగా చెందిన ఆర్ఆర్ మూవీస్ పైన ఏకకాలంలో ఐటిఅధికారులు దాడులు చేయడం విశేషం. దీంతో సినీపరిశ్రమలోని ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.అయితే ఎవరు ఎంత చెల్లించాల న్నది ఇంకా బయటపడాల్సి ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!