సిఎం డ‌బ్బులు పంచాడంట‌..


 ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకుగాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదమూడు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామా రావు ఆరోపించారు.ఒక్కొక్కరికి పాతిక లక్షల చొప్పున ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై సిబిఐ విచారణ జరిపితే రుజువు చేస్తామని ఆయన సవాల్ చేశారు.ముఖ్యమంత్రిపై టిఆర్ఎస్ నేత చేసిన ఆరోపణ సంచలనాత్మకమైనదేనని చెప్పాలి. గత రెండు రోజులుగా సుమారు పది, పదిహేను మంది ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా, సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడిన నేపధ్యంలో కెటిఆర్ ఈ ఆరోపణలు చేయడం విశేషం.కోఠిలోని మహిళా కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు.తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్న సమయంలో వారిని ప్రలోభ పెట్టడానికి సి.ఎమ్.డబ్బులిచ్చారని ఆయన ఆరోపించారు.కెటిఆర్ చెబుతున్నదానిని బట్టి డబ్బు సంగతి ఎలా ఉన్నప్పట్టికీ కిరణ్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదని పరోక్షంగా చెప్పినట్లుగా కూడా భావించవచ్చు. నిజంగానే కిరణ్ ఇలా తన పార్టీ ఎమ్మెల్యేలకే డబ్బులు ఇచ్చి ఉండి, దానికి సంబంధించిన ఆధారాలను కెటిఆర్ బయటపెట్టగలిగితే కెటిఆర్ కు మంచి ఇమేజీ వస్తుంది. లేకుంటే ఇది కేవలం నిరాధార ఆరోపణగా మిగిలిపోతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!