రైలురోకోను ఆపే ద‌మ్మెవ‌రికుంది..?


తెలంగాణ ఉద్యమ నేత కె.చంద్రశేఖరరావు వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సవాలు విసురుతున్నారు. సి.ఎమ్. ఎన్నివేశాలు వేసినా ఉద్యమం ఆగదని ఆయన స్ప్టం చేశారు.ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా శాంతియుతంగా ఉద్యమిస్తామని అంటూనే రైళ్లను ముఖ్యమంత్రి తిప్పగలరా అన్న సవాలును విసిరారు.రైలు పట్టాలపై కోటి మంది వస్తారని, వారందరిని ఆపగలరా? అని కెసిఆర్ అన్నారు.వంద శాతం తెలంగాణ వచ్చితీరుతుందని,తెలంగాణ వచ్చాక ఉద్యోగులకు అన్ని రకాల ప్రోత్సహాకాలు ఉంటాయని, ప్రమోషన్లు, వడ్డీతో సహా జీతాలు, ఒక నెల బోనస్ ఇస్తామని ఆయన ప్రకటించారు.హైదరాబాద్ లో జరిగిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు.ఆర్టీసి లో సమ్మె విరమించినట్లు ప్రకటించినా ఎవరూ హాజరు కాలేదని, అబద్దాలతో ఉద్యమాన్ని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.స్వామిగౌడ్ మీద ఉన్న కేసుపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాలు విసిరారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు , మంత్రులు సి.ఎమ్. బూట్లు తుడుచుకుంటున్నారని ఎద్దేవ చేశారు.తెలంగాణ వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులందరి ఉద్యోగాలను పర్మనెంటు చేస్తామని కూడా ఆయన అన్నారు.తెలంగాణపై ఎన్నాళ్లు కాలయాపన చేస్తారని కూడా ఆయన ప్రశ్నించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!