అన్నా బృందం స‌భ్యుడు ప్రశాంత్ భూష‌ణ్‌పై దాడి


అన్నా హ‌జారే టీంలో స‌భ్యుడు అయిన న్యాయ‌వాది  ప్రశాంత్ భూష‌ణ్‌పై దాడి జ‌రిగింది. సుప్రీం కోర్టులో త‌న ఛాంబ‌ర్‌లో ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కి ఇంట‌ర్వ్యూ ఇస్తున్న సంద‌ర్భంలో ముగ్గురు దుండ‌గులు వ‌చ్చి ప్రశాంత్ భూష‌ణ్‌పై విరుచుకు ప‌డ్డారు. పిడిగుద్దులు గుద్దుతూ ఆయ‌న‌పై చేయిచేసుకున్నారు. ఈ దాడికి కార‌ణం ప్రశాంత్‌భూష‌ణ్ కాశ్రీర్ అంశంపై ఆయ‌న చేసిన కామెంట్లే అని వినిపిస్తున్నది. కాశ్మీర్‌ని భార‌త‌దేశం నుంచి వేరు చేస్తే మంచిది అన్న భావంతో ఆయ‌న కామెంట్ చేశారు. అందుకోస‌మే ఆయ‌న్ని కొంద‌రు గుర్తుతెలియ‌ని వ్యక్తులు దాడి చేశారు. ఒక సీనియ‌ర్ న్యాయ‌వాది, అవినీతి వ్యతిరేక నిర్మూల‌న కోసం కృషి చేస్తున్న ప్రశాంత్ భూష‌ణ్‌పై ఇలా దాడి జ‌ర‌గ‌డం దుర‌దృష్ట క‌రం..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!