అంత‌రిక్ష విజ్ఞానంలో భార‌త్ ముందంజ‌..




అంతరిక్ష విజ్ఞానంలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ18 ప్రయోగం విజయవంతమైంది. ఒకే సారి నాలుగు పరిశోధక ఉపగ్రహాలను నిర్ణీత ధ్రువ కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో భారత సైంటిస్టులు తమ ప్రతిభను మరోసారి ప్రపంచ దేశాలకు చాటారు. వరుస విజయవంత ప్రయోగాల్లో ఇది 18వది. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు భారత్‌కు పరిశోధన ఫలాలతోపాటు వాణిజ్య ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి.
వాతావరణ పరిశోధనకు తోడ్పడే మేఘా-ట్రోపిక్స్ ఉపగ్రహంతోపాటు మరో మూడు చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ సీ 18) ద్వారా షార్ బుధవారం ఉదయం 11 గంటలకు అంతరిక్షంలోకి పంపింది. వెయ్యి కిలోలు బరువు ఉన్న ఈ ఉపగ్రహం లక్ష్యం దిశగా దూసుకుపోతుంది. మూడు దశలను విజయవంతంగా దాటుకుని 24 నిమిషాల్లో పీఎస్ ఎల్ వీ నిర్ణీతకక్షలోకి ప్రవేశించనుంది.
పీఎస్‌ఎల్వీ సీ 18 రాకెట్ ద్వారా వెయ్యి కిలోల బరువు కలిగిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం మేఘా-ట్రోపిక్స్‌ను భూమికి 867 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలోకి (సన్ సింక్రోనస్ ఆర్బిట్) వెళ్లనుంది. ఈ ఉపగ్రహాన్ని భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా రూపొందించాయి.
మేఘా-ట్రోపిక్స్‌తోపాటు లక్సంబర్గ్‌కు చెందిన 30 కిలోల బరువైన వెజల్‌శాట్-1, కాన్పూర్ ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు రూపొందించిన జుగ్నుశాట్(3 కిలోల బరువు), చెన్నై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన ఎస్‌ఆర్‌ఎం శాట్(10 కిలోల బరువు)ను కూడా పీఎస్‌ఎల్వీ అంతరిక్షంలోకి మోసుకుపోనుంది. షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!