ప్రభుత్వం చాలా అధ్వాన్నంగా వుంది

ప్రభుత్వ విశ్వసనీయత ఎన్నడూ లేనంత అద్వాన్నంగా మారిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వినోద్ రాయ్ వ్యాఖ్యానించారు.సర్దార్ వల్లభ్ భాయి పటేల్ స్మారక ఉపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆడిటింగ్ వ్యవస్థకు అధినేత అయిన వినోద్ ఇంకా సంచలనంగా మాట్లాడారు.దేశంలో ప్రభుత్వ పాలనతీరు ఎన్నడూ లేనంత అధ్వాన్నంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉండవచ్చు. కాని కఠోర వాస్తవిమిది అని ఆయన అన్నారు.అలాగే అఖిలభారత సర్వీసుల అధికారులు కూడా తమ పాత వైభవాన్ని పునరుద్దరించడానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వ నాణ్యత ఎంత హీనంగా ఉందో వివరిస్తూ,అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రులు పదవుల నుంచి తప్పుకోవలసి వస్తోంది.కేంద్ర మంత్రులు అవినీతి కేసులలో చిక్కుకుని జైలులో ఉంటున్నారు.తప్పులు చేసి మరికొందరు కేంద్ర మంత్రులు పదవి నుంచి వైదొలగవలసి వస్తోంది.వివిధ చట్టాల కింద ఎమ్.పిలు న్యాయవ్యవస్థ నుంచి అక్షింతలు వేయించుకుంటున్నారు.ఏకంగా కొందరు ఎమ్.పిలు ఓటు వేయడానికి డబ్బు తీసుకున్నట్లు అభియోగాలు వచ్చాయి.అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇవన్ని దేశంలో పరిపాలన ఎంత క్షీణించిందో తెలియచెబుతుందని వినోద్ రాయ్ అన్నారు.వినోద్ చెప్పినట్లు నిజంగానే కేంద్రంలోకాని, రాష్ట్రంలో కాని పరిపాలన నాణ్యత క్షీణించిన మాట నిజమేనని ఒప్పుకోవాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!