త‌మిళ‌నాడులో ఘోర రైలుప్ర‌మాదం


తమిళనాడులోని అరక్కోణం సమీపంలో వేల్పాకం చిట్టేరి వద్ద మంగళవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమా దంలో పది మంది మరణించారు. దాదాపు 85 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో రెండు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఒకే లైనుపై మొదట అరక్కోణం-కాట్పాడి పాసింజర్‌ రైలును పంపించారు. అది వెళ్లిన కాసేపటికే చెన్నై బీచ్‌ నుంచి వేలూరు వెళ్లే రైలును వదిలారు. వేగంగా వెళ్లిన బీచ్‌ రైలు ముందు వెళుతున్న పాసింజర్‌ రైలును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బీచ్‌ రైలు రెండు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మృతుల్లో బీచ్‌రైలు డ్రైవర్‌, ప్యాసింజర్‌ రైలు గార్డు కూడా ఉన్నారు. మంగళవారం రాత్రి 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. రెడ్ సిగ్నల్‌ను గుర్తించకుండా డ్రైవర్ రైలును వేగంగా తోలడం వల్లనే ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!