గాంధేయమార్గ‌మే మంచిది


ఆంధ్ర ప్రదేశ్‌కు గాంధేయవాద అవసరం ఆవశ్యమని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఆదివారం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో గాంధేయవాదం చాలా అవసరం అన్నారు. అహింసా, గాంధీ పద్ధతులు రాష్ట్రానికి, దేశానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు.  గాంధేయవాదంపై ప్రత్యేక వ్యాసరచన పోటీలు నిర్వహించి పది లక్ష రూపాయల నగదు బహుమతి ఇవ్వాలని కూడా అజాద్ సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కాలంలో జరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని అజాద్ ఈ వ్యాఖ్యలు చేశారని అర్ధం అవుతుంది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలలో అప్పడుప్పుడు హింస జరుగుతుండడంతో ఆయన ఈ సలహా ఇచ్చారని అర్ధం చేసుకోవచ్చు.  గాంధీజీ ఆశయ సాధనలను విద్యార్థులకు తెలిసేలా ప్రభుత్వం మరిన్ని చర్చలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్ సూచించారు. నిజాయితీ, అహింసా ప్రస్తుత కాలంలో ఎక్కువగా అవసరం ఉందన్నారు. వాదాన్ని పెంపొందింపజేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. గ‌తంలో ఆజాద్ జ‌మ్మూ కాశ్మీర్ ముఖ్య‌మంత్రిగా కూడా ప‌ని చేశారు. అక్క‌డ ఉగ్ర‌వాదం ఛాయ‌లు అతిగా ఉండ‌టం తెలిసిందే. అయితే అక్క‌డ తాను ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు స‌త్యం, అహింస‌ల‌ని పాఠ్యాంశాల‌లో చేర్పించిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆయ‌న సూచించిన మార్గం బాగానే ఉన్న‌ప్ప‌టికీ ఆచ‌ర‌ణ విశ‌యానికి వ‌స్తే మాత్రం ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ సాధిస్తుందో క‌దా..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!