అడ్డాగా మారుతున్న‌ఔట‌ర్‌రింగ్‌రోడ్‌


అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ యాక్సిడెంటుతో ఔట‌ర్‌రింగ్‌రోడ్డు ఇప్పుడు వార్త‌ల్లో నిలిచింది. విశాల‌మైన రోడ్ల‌పై మితిమీరిన వేగంతో బైక్‌లు న‌డుపుతూ చివ‌రికి మృత్యుఒడిలోకి పోతున్న యువ‌త‌కి ఈ ఔట‌ర్ రింగ్‌రోడ్డు మృత్యువుకి దార‌వుతుంది.  ఔట‌ర్‌రింగ్‌రోడ్‌.. న‌గ‌రంలో ట్రాఫిక్ ఇబ్బందుల‌ని దృష్టిలో ఔట‌ర్‌రింగ్‌రోడ్డుని ఏర్పాటు చేశార‌ని అంద‌రికీ తెలిసిందే.. దీని ముఖ్య ఉద్దేశ్యం ఔట‌ర్ రింగ్‌రోడ్డు గుండా వెళితే ప్ర‌యాణ స‌మ‌యం చాలా ఆదా చేయ‌డ‌మే కాకుండా ట్రాఫిక్ స‌మ‌స్య‌ని కూడా నివారించ‌వ‌చ్చ‌ని దీనిని ఏర్పాటు చేశారు. కానీ.. అదే ఔట‌ర్ రింగ్‌రోడ్డు ఇప్పుడు అసాంఘీక పనుల‌కి అడ్డాగా మారుతున్న‌ది. కోటీశ్వ‌రుల పిల్ల‌లు త‌మ జ‌ల్సాల‌ని తీర్చుకోవ‌డానికి ఈ ఔట‌ర్ రింగ్‌రోడ్డుని చ‌క్క‌గా వాడుకుంటున్నారు. తండ్రులు సంపాదించిన డ‌బ్బుతో జులాయిగా తిరిగే కొంద‌రు అతి ఖ‌రీదైన బైక్‌ల‌పై, అతివేగంగా ప్ర‌యాణం చేయ‌డం సాధార‌ణ‌మైపోయింది. అంతే కాదు.. వీకెండ్ పార్టీలంటూ శ‌ని ఆది వారాల‌లో బైక్ రేసింగ్ పోటీల‌కి దిగుతుంటారు. వీరు పంజాగుట్ట నుండి శంశాబాద్ ఎయిర్‌పోర్ట్ వ‌ర‌కు బైక్‌రైసింగ్ పోటీలు పెట్టుకుంటారు. అత్యంత వేగంగా డ్రైవ్ చేసుకుంటూ శంషాబాద్ రోడ్ ద‌గ్గ‌ర వారు నిర్దేశించిన ప్రాంతానికి ఎవ‌రు ముందుగా వెళితే వారికి ఫ్రైజ్ ల‌భిస్తుంద‌న్న‌మాట‌. ఆ ఫ్రైజ్‌కూడా ల‌క్ష‌ల్లోనే ఉంటుంద‌ని స‌మాచారం. ఇలాంటి బైక్ రైజింగ్‌ల‌కి నిర్మానుశ్యంగా ఉండే ఔట‌ర్ రింగ్‌రోడ్డు అడ్డాగా మారిపోయింది. దాంతో మితిమీరిన వేగంతో బైక్‌ల‌ని న‌డుపుతూ ఆ బైక్‌ని కంట్రోల్ చేయ‌లేక యాక్సిడెంట్‌ల‌కి గుర‌య్యి ప్రాణ‌లు కోల్పోతున్నారు. అస‌లు ఔట‌ర్‌రింగ్‌రోడ్డు కేవ‌లం 4 వీల‌ర్స్ కే ప‌రిమితం, టూ వీల‌ర్ వెళ్ళ‌డాన‌నికి ప‌ర్మిష‌న్ లేదు. మ‌రి తాజాగా అజారుద్దీన్ కుమారుడు బైక్‌పై రింగ్‌రోడ్డుకి ఎలా వెళ్ళాడ‌న్న‌ది ప్ర‌శ్న. డ‌బ్బుకి ఆశ‌ప‌డ్డ కొంద‌రు అవినీతి అధికారులు టై-వీల‌ర్‌ల‌కి ప‌ర్మిష‌న్ ఇస్తున్నారు. ఖ‌రీదైన బైక్‌లపైన గాల్లో తేలుతూ వెళ్ల‌డం ప్ర‌స్తుతం డ‌బ్బున్న కుర్రాళ్ళ‌కి మోజుగా మారిపోయింది.  వీరి త‌ల్లిదండ్రులు కూడా త‌మ పిల్ల‌ల‌కి కావాల‌న్న‌ప్పుడు ఖ‌రీదైన బైకులు కొనిపించి చేతులు దులుపుకోకుండా.. వారిని నిర్ల‌క్ష్యంగా డ్రైవింగ్ చేయ‌డం, మితిమీరిన వేగంతో వెళ్ళ‌కుండా నివారించ‌డం లాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా ఉంటే భ‌విష్య‌త్తులో ఎంద‌రో తండ్రుల‌కి పుత్ర‌శోకం మిగులుతుంది.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

సిహెచెస్కే

ceehecheske@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!