గణేషా.. ఇక సెలవు..!
ఆదివారం సుమారు 30 నుంచి 40 వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశముంది. నిమజ్జనం చూసేందుకు ట్యాంక్‌బండ్ వద్దకు దాదాపు 12 లక్షల మంది వస్తారని అంచనా. నగరంలోని సుమారు 14 వేల మంది పోలీసు సిబ్బందికి అదనంగా.. జిల్లాల నుంచి 35 వేల మంది అదనపు బలగాలను రప్పించారు. పారా మిలిటరీ దళాలనూ మోహరించారు. 35 బాంబ్ స్క్వాడ్‌లు, వెయ్యి వైర్‌లెస్ సెట్లు, వెయ్యి వీడియో కెమెరాలను ఏర్పాటు చేశారు. హోంమంత్రి సబిత, డీజీపీ దినేశ్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఊరేగింపు మార్గాలను పరిశీలిస్తారు. నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రత్యేక బస్సులు, అదనంగా ఎంఎంటీఎస్ రైళ్లూ నడుపుతారు. ఇక హైదరాబాద్‌లోనే అతి పెద్ద వినాయకులు ఖైరతాబాద్ వినాయకుడు. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చాలా సమయం తీసుకుంటుంది. అయితే ఈసారి మాత్రం రాత్రి పదిగంటల లోపే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తామని నిర్వాహకులు తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి