విజ‌య‌వాడ‌లో భారీ విలీన‌స‌భ‌


ఎట్ట‌కేల‌కు పీఆర్పీ విలీన స‌భా వేదిక ఖ‌రార‌యింది. కోస్తాంధ్రలో భారీ స్థాయిలో విలీన సభ నిర్వహించాలని పట్టుబట్టిన చిరంజీవి అనుకున్న‌ట్టుగానే విజయవాడలో భారీ యెత్తున విలీన సభ నిర్వహించడానికి కాంగ్రెసు నాయకత్వం అంగీకరించింది. సభకు యూపీఏ అధినేత్రి సోనియాగాంధీని ఆహ్వానించాలని ఇరుపార్టీల నేతలూ యోచిస్తున్నారు. మంగళవారం సాయంత్రం చిరంజీవి కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలతో సమావేశమైన సందర్భంగా సభ పెట్టాల్సిందేనని అత్యధికులు అభిప్రాయపడ్డారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం రాత్రి చిరంజీవి నివాసానికి వెళ్లి చర్చించారు. సభ ప్రతిపాదనను బొత్స బలపరిచారు. విజయవాడలో జక్కంపూడి ప్రాంతంలోనే 100 ఎకరాల స్థలం ఉందనీ, ఇందులోనే సభ ఏర్పాటు చేయవచ్చని భావించారు. స్థల పరిశీలన, ఇతర ఏర్పాట్ల కోసం అయిదుగురితో ఒక కమిటీని నియమించాలని నిర్ణయించారు. సాంకేతికంగా విలీన ప్రక్రియ పూర్తయినా, ప్రరాపా శ్రేణులన్నీ కాంగ్రెస్‌లో కలిసి పోయేందుకు కొంత సమయం పడుతుందని, ఇది సజావుగా సాగేందుకు ఒక కమిటీని నియమిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా వచ్చింది. ప్రరాపాలో పని చేసిన సీనియర్‌ నాయకులు అయిదుగురి పేర్లను సూచిస్తే వారితోనే కమిటీ వేద్దామని బొత్స ప్రతిపాదించగా, దీనికి అంగీకరించిన చిరంజీవి రెండు రోజుల్లో పేర్లు ఇస్తానని చెప్పారు. విలీన సభ కోసం వేసే కమిటీనే సమన్వయానికీ కొనసాగిస్తే సరిపోతుందని భావించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!