ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అలంకార ప్రాయ‌మేనా..?


1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ఒక ఒప్పందం కుదిరింది దానిని పెద్ద మనుషుల ఒప్పందంగా పిలుస్తారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ పెద్దలంతా కలిసి కూర్చుని, చర్చించుకుని తయారు చేసిన ఒప్పందంపై ఆనాటి పెద్దలు సంతకాలు చేశారు. నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, కె.వి.రంగారెడ్డి,గౌతు లచ్చన్న వంటి ప్రముఖులు దీనిపై సంతకాలు చేశారు.ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి కోస్తాలేదా రాయలసీమ వారైతే, తెలంగాణ వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కావాలి. కాని నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రిని నియమించలేదు. పైగా ఎవరైనా విమర్శిస్తే అది ఆరో వేలు వంటిదని తెలంగాణ నాయకుడు కె.వి.రంగారెడ్డి కూడా అన్నారని చెప్పేవారు.అదేమంటే తాను కూడా గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి చేశానని, దానిలో ఒక్క అదనపు అదికారం ఉండదని, ఆరో వేలు వంటిదని ఆయన అన్నారు. ఒకసారి ఆనాటి తెలంగాణ నేత కెవి రంగారెడ్డి ఒకసారి ఆస్పత్రిలోఉన్నారు. అప్పుడు ఆయన వద్దకు వెళ్లి ఉప ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించారు. ఆ సందర్భంగా ఆ పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదని అది ఆరోవేలు వంటిదని అనుకున్నట్లు ప్రకటించారు. కాని నిజానికి అది ఆరో వేలు అయినా, కాకపోయినా, పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఆదిలోనే ఉల్లంఘించిన ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి రికార్డుకు ఎక్కారు. విశేషం ఏమిటంటే ఆయన బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు. ఆ తర్వాత 1960లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు కె.వి.రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రి గా పదవీ స్వీకరించారు. ఆరో వేలు అనుకుంటే కెవి రంగారెడ్డి ఈ పదవికి తర్వాత కాలంలో ఎందుకు అంగీకరించినట్లన్న ప్రశ్న వస్తుంది.ఇక ఆ తర్వాత ఈ పదవి నిర్వహించిన జెవి నరసింగరావు, బివిసుబ్బారెడ్డి, సి.జగన్నాధరావు, కోనేరు రంగారావు , ఇప్పడు దామోదర రాజనరసింహలు ఉప ముఖ్యమంత్రులయ్యరు ఇక కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవిని కోస్తాకు చెందిన కోనేరుకు అప్పగించారు. అది కూడా విచిత్రంగానే ఉంటుంది. నిజంగానే ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రత్యేకమైన అదికారాలేమీ లేవు. మంత్రులతో సమానమే. కాకపోతే ఉప ముఖ్యమంత్రి అన్న హోదా సంతృప్తి కలిగిస్తుంది.అంతకు మించి ప్రయోజనం ఉంటుందని అనుకోనవసరం లేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!