పోలీసుల అదుపులో ఇద్దరు మంత్రులు

మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు మంత్రుల మద్య తగాదా తారాస్థాయికి చేరింది. మొదట మంత్రి డి.కె.అరుణను అరెస్టు చేయగా, ఆ తర్వాత మంత్రి జూపల్లె కృష్ణారావును అరెస్టు చేయబోగా ఆయన కత్తి తో మెడ కోసుకుంటానని బెదిరించడం విశేషం. శనివారం తెల్లవారు జామున ఇరువర్గాల మధ్య తుమ్మలపల్లి చౌరస్తాలో వివాదం రేగింది. తన అనుమతి లేకుండా తన నియోజకవర్గంలోకి ఎలా వస్తారని డి.కె. అరుణ ప్రశ్నించారు.తన వియోజకవర్గంలోకి వస్తే అడ్డుకుంటానని హెచ్చరించారు.ఎట్టి పరిస్థితులలోను యాత్ర జరిపి తీరుతానని కృష్నారావు పేర్కొన్నారు.మొదట జూపల్లెను అరెస్టు చేయకపోయినా, ఆ తర్వాత ఆయనను కూడా హౌస్ అరెస్టు చేశారు. వీరిద్దరూ ఎవరికి వారు నువ్వు తెలంగాణ ద్రోహి అని విమర్శించుకుంటున్నారు. తనను అడ్డుకుంటే మిగిలిన నియోజకవర్గాలలో ఎక్కడా అరుణను తిరగనివ్వరని కృష్ణారావు హెచ్చరించారు.కృష్ణారావు తన నియోజకవర్గంలో తిరగడం కోసమే ఈ యాత్ర చేపట్టారని, తాను తెలంగాణ వాదినేనని అరుణ జవాబు చెప్పారు.తనను మహారాణి అంటూ ఇంకేదో అంటూ అగౌరపరుస్తున్నారని ఆమె విమర్శించారు.తన ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుందని, తాను మహారాణిగా ఉన్నానా, ప్రజల తరపున పనిచేస్తున్నా అనేది, తన ఇంటివ వద్దకు వచ్చే ప్రజలే నిదర్శనమని ఆమె అన్నారు. అరుణ చెప్పినట్లుగానే జూపల్లె పాదయాత్రను అడ్డుకోగా, జూపల్లె కూడా పట్టు వీడకుండా తన యాత్ర సాగిస్తానంటున్నారు. ఇద్దరూ చివరికి పోలీసుల అదుపులో ఉన్నారు. కాని కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు మంత్రులు ఈ విధంగా కలహించుకుంటుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చోద్యం చూస్తున్నట్లూ చూస్తూ నిస్సహాయంగా మిగిలిపోయారు. ఇక పార్టీ అదిష్టానం సైతం ఈ తగాదాలను పరిష్కరించలేకపోతోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!