ఇక సూపర్ కమిటీ/కిరణ్ పాలన
కాంగ్రెస్ నేతలకి భలే భలే ఆలోచనలు వస్తుంటాయి. తాజాగా వారి కొచ్చిన కొత్త ఆలోచన కిరణ్ సర్కార్ పై సూపర్ కమిటీ .
ఆలోచన సూపర్ గా వుంది కదా. కిరణ్ సర్కార్ కి పార్టీ కి మధ్య సమన్వయము కోసం ,ప్రభుత్వం సజావుగా నడవడం కోసం కాంగ్రెస్ అధిష్టానం ఒక కోర్ కమిటీ వేస్తున్నదట. ఈ కమిటీ కనుసన్నల్లో ఇక సర్కార్ పని చేయాలట ! ఆహా .ఈ ఆలోచన ఎవరిదో గానీ వారికీ కోటి వందనాలు .
మళ్ళీ ఈ కమిటీ కి ఒక పర్యవేక్షకుడు కూడా .(మరి సీఎం కి ఏం పవర్స్ వుంటాయి ?? ఏమి వుండవు . కేవలం నామ మాత్రపు సీఎం మాత్రమే .ఆ విషయాలు మనం అర్ధం చేసుకోవాలి ,బయటికి చెప్పరు ) అంటే పగ్గాలు బిగించి సీఎం ని కుర్చీలో కూర్చోబెడతారు అన్నమాట. కాంగ్రెస్ అధిష్టానం కి ఎంత గొప్ప ఆలోచనలు వస్తుంటాయి. ఇలా పగ్గాలు వేసి కూర్చో బెట్టె సీఎం ప్రజలందరికి సుపరిపాలన అందిస్తారని చెబితే అందరం నమ్మాలి .ఈ కమిటీ ఏర్పడిన దరిమిలా పేరుకి మాత్రం ఇకపై సీఎం కిరణ్ , పెత్తనం మాత్రం అధిష్టానం దేసుపరి పాలన పేరిట అధిష్టానం ఏమి మేసినా సారీ ఏం చేసినా చూస్తుండాలి. ఇపుడు కేంద్రం లో నడుస్తున్న పాలన కూడా అదే కదా. అదే రీతిలో ఇక్కడ అమ్మ గారు లేదా ఆమె అనుయాయులు పాలిస్తుంటారు అన్నమాట. భేష్ !భేష్ ! పాపం కిరణ్ ఇంత లోతుగా ఆలోచన చేసారో లేదో కానీ అన్నింటికీ తలకాయ ఊపెసినట్టున్నారు.. కానీవ్వండి.. కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యం లో కొత్త కమిటీ ఎలాంటి పాలన ఇస్తుందో చూద్దాం .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి