తెలంగాణాలో నాగం హీరో, బాబు జీరో నా ?
తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు పార్టీ అధినేత చంద్ర బాబు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.దీంతో బాబు అయోమయం లో పడ్డారు. పార్టీ జెండాలు పెట్టని తెలంగాణ సభలకు హాజరు కావద్దని, పార్టీ జెండాలతోనే సభలు నిర్వహించాలని చంద్రబాబు స్వయంగాఆదేశాలు జారీచేసినా సీనియర్ నేత నాగం తూనా బొడ్డు అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో పార్టీ జెండా లేకుండానే తెలంగాణ సభ నిర్వహించారు.తన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా కొందరు ఎమ్మెల్యేలు ఈ సభకు హాజరు కావడంతో ఈ సమస్యను ఎలా పరిష్కారించాలా అని బాబు ఇపుడు మల్ల గుల్లాలు పడుతున్నారు.నాగం ఒక్కడే సభలు పెట్టుకుంటే పర్వాలేదు కానీ ఆయనకు ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది.ముఖ్యం గా బాబుని కలవర పెడుతున్నఅంశం ఇదే.రోజు రోజుకి తెలంగాణ లో నాగం హీరో అవుతున్నాడు .ఆయనకు అండగాఎమ్మెల్యేలు హరీశ్వరరెడ్డి, ేణుగోపాలచారి,జోగు రామన్నలు నిలబడగా ,కొత్తగా బోడ జనార్ధన్ జత అయ్యారు.ఈ సంఖ్య క్రమంగాపెరుగుతుందా? ఇంతటితో ఆగుతుందా?అని చంద్ర బాబు మధనపడుతున్నారు.ఈ దశలో నాగం ను సస్పెండ్ చేసినా ఫలితం వుండదు.పైగా నాగం ఆగం ఆగం చేసి ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తారు.అంతటితో ఆగకుండా కొత్త పార్టీ పెట్టినా పెట్ట వచ్చు,లేదా జగన్ పార్టీ లో చేరిపోవచ్చు అని దేశం పార్టీ నేతలు మరో పక్క ప్రచారం చేస్తున్నారు. కాగా ఇప్పటికీ నాగం పై వేటు వేయమని కొందరు నేతలు ఒత్తిడి తెస్తున్నారు.అయితే బాబు వేచి చూసే ధోరణి తో వ్యవహరిస్తున్నారు. “మహా నాడు” లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తం మీద బాబు పరిస్తితి ముందు నుయ్యి వెనుక గొయ్యి చందనా వుంది. ఇదిలా వుంటే నగారా సభలు సక్సెస్ కావడం తో నాగం మరికొన్ని చోట్ల సభలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.చంద్రబాబు సూచన మేరకు టిడిపి తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఎర్రబెల్లి కొన్నిజిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించ బోతున్నారు.తెలంగాణ వాదాన్ని జనం లో కెక్కించిన టీఆర్ఎస్ మాత్రం ఏం జరగ బోతుందా అని ఆసక్తిగా చూస్తోంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి