‘క్రిష్ 3లో ముగ్గురు హృతిక్‌లు
క్రిష్, క్రిష్-2 చిత్రాలతో హృతిక్ రోషన్‌కి భారీ విజయాలని అందించిన ఆయన తండ్రి రాకేష్ రోషన్ తాజాగా క్రిష్ – 3 చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు.. అయితే రాకేశ్ రోషన్ రూపొందించే ‘క్రిష్ 3′లో హృతిక్ రోషన్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడనేది బాలీవుడ్‌లో విశేషంగా చెప్పుకుంటున్నారు. గత రెండు చిత్రాల్లో హృతిక్ తండ్రీ, కొడుకులు కనిపిస్తే ఇందులో అతను తాత, తండ్రి, కొడుకు పాత్రల్ని పోషించబోతున్నాడు. ఇందులోని విలన్ పాత్రని రాకేశ్ స్వయంగా చేస్తాడని ఇదివరకు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ పాత్రకి వివేక్ ఓబరాయ్ ఎంపికయ్యాడు.
‘అగ్నీపథ్’ షూటింగ్, ‘జిందగీ నా మిలేగీ దోబరా’ ప్రమోషన్‌తో హృతిక్ బిజీగా ఉండటం వల్లే ‘క్రిష్ 3′ ప్రారంభంలో జాప్యం జరుగుతూ వచ్చింది.
మొత్తానికి వచ్చే నవంబర్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది. ప్రస్తుతం లొకేషన్ల వేటలో ఉన్నాడు రాకేశ్. ‘క్రిష్’ సీరిస్‌లో తొలి రెండూ పెద్ద హిట్టవడంతో ఇప్పుడు మూడో సినిమా మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి