అవిశ్వాసం పై చర్చ లేకుండానే అసెంబ్లీ నిరవధిక వాయిదా
ముందుగా ఊహించినట్టు గానే అవిశ్వాసం పై చర్చ జరగకుండానే అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. టీడీపీ శనివారం ఉదయం కిరణ్ సర్కార్ పై అవిశ్వాసం పెట్టేందుకు మళ్ళీ నోటిస్ కూడా ఇచ్చింది . అయితే స్పీకర్, డిప్యూటి స్పీకర్ ఎన్నిక, అభినందనలు పూర్తీ కాగానే స్పీకర్ సభను నిరవధికం గా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పోడియం వద్దకు దూసుకెళ్ళి భైటాయించారు. అవిశ్వాస తీర్మానం పై చర్చకు అవకాశం కల్పించాలని పట్టు పట్టారు. అయితే ఇవేవి స్పీకర్ పట్టించుకోలేదు. ఈ పరిణామం తో ఆగ్రహించిన చంద్ర బాబు ఇక గవర్నర్ దగ్గర ఈ అంశం పై తేల్చుకోవాలని నిర్ణయించారు . ఈ సాయంత్రం గవర్నర్ ని కలసేందుకు సిద్ధమౌతున్నారు.
–KNM
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి