రైతు చైతన్య యాత్రలకు మంత్రులు డుమ్మా
రైతు చైతన్య యాత్రలకు పదహారు మంది మంత్రులు డుమ్మా కొట్టారంటే ఈ సర్కా కి రైతు పట్ల ఎంత ప్రేమ వుందో అర్ధమైపోతుంది. చైతన్య యాత్ర లంటే మంత్రులే భయపడిపోయే పరిస్థితి నెలకొందంటే రైతు దుస్తితి మరెంత ఘోరంగా వుందో ఇట్టే తెలిసిపోతుంది ధాన్యానికి గిట్టుబాటు ధర మాట అటుంచితే .. కొనే నాథుడే లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు .ఇలాంటి పరిస్తితుల్లో రైతుకి అండగా నిలవాల్సిన సర్కార్ చైతన్య యాత్రలు చేయడం కంటే కొనుగోలు యాత్రలు చేయాల్సిన అవసరం ఎంతో వుంది ఇదిలా వుంటే రైతు చైతన్య యాత్రలకు తొలి రోజే నిరసన సెగలు తగిలాయి. దీంతో యాత్రలకు వెళ్తే రైతులు నిలదీస్తారని, వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయం తో మంత్రులు డుమ్మా కొట్టారు. సీఎం కిరణ్ కూడా రైతు సమస్యల పరిష్కారం పట్ల అంత సీరియస్ గా లేరు. మొత్తం సర్కారే నాన్ సీరియస్ గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. చంద్ర బాబు సీఎం కిరణ్ ను ఒట్టి చవట, దద్దమ్మ,అసమర్ధుడు అని రోజు తిట్టిపోస్తున్నారు. ఇక జగన్ ప్రజా సమస్యలు పట్టని ఈ సర్కార్ కూలిపోవడం ఖాయమని ఢంకా భజాయించి చెబుతున్నారు. బీజేపీ ,టీ అర్ ఎస్ లు అయితే సర్కార్ కి శాపనార్ధాలు పెడుతున్నాయి అయినా కిరణ్ సర్కార్ క్రియ శీలకం కావడం లేదు కాగా ధాన్యం కొనుగోళ్లపైనే కాకుండా అటు రచ్చబండలో ఇచ్చిన హామీలకు సంబంధించిన పింఛన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల విషయంపైనా ప్రజలు నిరసనలు తెలియ చేయడానికి సిద్ధమౌతున్నారు ధాన్యానికి ధర రాక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముందు ఆ సమస్యను పరిష్కరించకుండా వచ్చే ఖరీఫ్‌పై అవగాహన కల్పించా లనుకోవడం తెలివైన పాలకుల లక్షణమో?తెలివి తక్కువ పాలకుల లక్షణమో ప్రజలే త్వరలో నిర్ణయిస్తారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి