ఒకే దెబ్బకి రెండు పిట్టలు..
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన గాలి జనార్థన్‌రెడ్డి అరెస్టు వెనుక ఎవరి హస్తం వుంది…? బిజెపిలో బలమైన నాయకుడిగా ఎదిగి మైనింగ్‌కింగ్‌గా పేరు సంపాదించుకున్న గాలి జనార్థన్‌రెడ్డి చివరికి జైలు ఊచలు లెక్కపెట్టుకొనేలా చేసేది ఎవరు..? ఇక రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులపై సిబిఐ అధికారుల దాడుల వెనుక ఎవరి హస్తం ఉంది..? వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల లెక్క తేల్చాలని ఆ తర్వాత జగ్‌ని జైలుకి పంపాలని యోచిస్తున్నది ఎవరు..?
సూక్ష్మంగా ఆలోచిస్తే గాలి జనార్థన్‌రెడ్డి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డిల కేసులని పరిశీలిస్తే.. వీటి వెనుక బలమైన హస్తాలే పనిచేస్తున్నట్టనిపిస్తుంది. బిజెపిలో ఎంతో పలుకుబడి కలిగిన నాయకుడు, కర్నాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి, బిఎస్. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కావడానికి ప్రధాన కారకుడు గాలి జనార్థన్‌రెడ్డి, మరి అలాంటి వ్యక్తిని సిబిఐ అధికారులు అరెస్టు చేస్తుంటే బిజెపి అధిష్టానం ఎందుకు నిమ్మకు నీరెత్తకుండా ఉంది..? బిజెపి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారకుడైన గాలిని బిజెపి ఎందుకు కాపాడటానికి ప్రయత్నించలేదు.. ఇక జగన్ విషయానికి వస్తే.. గాలి జనార్థన్‌రెడ్డికి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గాలి సోదరుల అక్రమాలు మితిమీరిపోయాయని, అంతేకాకుండా గాలి, జగన్ ల మధ్య వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయని చెబుతారు. అసలు వైఎస్ జగన్ కొత్త పార్టీ పెట్టడం వెనుక గాలి హస్తం ఉందని కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ని రక్షించేందుకు గాలి ప్రయత్నిస్తారని, ఆయనకి అండగా ఉంటారని ఎవర్నడిగా చెబుతారు. సో.. ఇటు జగన్‌ని, అట గాలిని కట్టడి చేస్తే.. ఒకే దెబ్బకి రెండు పిట్టలు రాలిపోతాయన్న ఆలోచన అధిష్టానానికి వచ్చిందా..? కర్నాటకలో గాలి బిజెపి నాయకుడిగా ఉన్నా ప్రస్తుతం బిజెపి పార్టీకి వ్యతిరేకకార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారాడు, ఇటు ఆంధ్రాలో వైఎస్ జగన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరకాటం పెట్టే విధంగా, జనంలోకి దూసుకుపోతూ ప్రత్యేక అభిమానాన్ని చూరగొంటున్నాడు. అంతేకాదు జగన్‌పై కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన్ని జనం ఆదరించడం చూసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పోస్తున్నాయి. అందుకే జగన్‌ని అక్రమ ఆస్తుల కేసులో నిర్బంధించి, జగన్‌కి వెన్నుదన్నుగా నిలుస్తున్న గాలి జనార్థన్‌రెడ్డిని కూడా కట్టడి చేస్తే.. రెండు ప్రభుత్వాలకి పెద్ద టెన్షన్ తగ్గిపోతుందని.. ఇదే విషయాన్ని అటు బిజెపి ముఖ్య నాయకుడు ఎల్.కె. అద్వానీ, ప్రధానమంత్రి మన్మోహన్‌ల మధ్య ఒక లోపాయికారి ఒప్పందం కూడా జరిగినట్టు వినిపిస్తుంది… గాలి జనార్థన్‌రెడ్డి అరెస్టు బిజేపి మౌనం వహిస్తే.. కర్నాటకలో బిజెపి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, అంతేగాకుండా ఇటు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కట్టడి చేస్తున్ విశయంలో కూడా బిజెపి తన మద్దతు తెలపకుండా ఉంటే.. ఆంధ్రలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సమస్య తీరుతుందని భావిస్తున్నారు.. అందుకే గాలి జనార్థన్‌రెడ్డి అరెస్టుని ఖండించేందుకు గానీ, గాలికి బాసటగా నిలిచేందుకు గాని బిజెపి సీరియస్‌గా స్పందించడం లేదు.
ఎన్నార్టీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి