కాంగ్రెస్ బాట‌లోనే టిడిపి కూడానా..?


స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు తగ్గించరాదని, అవసరమైతే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిలోను తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్లను తగ్గించడానికి అనుమతించబోదని ఆయన అన్నారు.స్థానిక సంస్థలలోనే కాక , చట్ట సభలలో కూడా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని ఆయన చెప్పారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఈలోగా పెట్టాలా? వద్దా అన్నదానిపై మాత్రం చంద్రబాబు మాట్లాడకుండా కేవలం బిసిలకు రిజర్వేషన్ల గురించి మాత్రమే మాట్లాడి సరిపెట్టుకోవడం గమనించదగిన అంశం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రస్థాయి వర్క్‌ ఫాస్ లో ప్రారంభోపన్యాసం చేశారు.తెలుగుదేశం పార్టీ కూడా రిజర్వేషన్లు తగ్గించకుండానే ఎన్నికలు జరపాలంటే అది హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత సుప్రింకోర్టుకు ఎవరైనా వెళ్లవచ్చు. మొత్తం మీద ప్రభుత్వం కూడా ఇదే పాయింటును కోరుకుంటోంది. రిజర్వేషన్లు తగ్గించడానికి తాము కూడా ఇష్టపడడం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ రకంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాకు ఈ రెండు పార్టీలు ఒప్పుకున్నటే అవుతుందా అన్నది చూడాలి.చంద్రబాబు సూచించినట్లు రాజ్యాంగ సవరణ చేయడానికి చాలా సమయం పడుతుంది. మరి ఈలోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలా?వద్దా?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!