ఆయ‌న పెట్టేవాడు.. ఈయ‌న కొట్టేవాడు..

విజయవాడ ఎంపీ.. లగడపాటి రాజగోపాల్ మరోసారి జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ ఇష్టానుసారం ప్రవర్తిస్తే.. సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. విజయవాడలో విలేకర్లతో మాట్లాడిన లగడపాటి.. జగన్ పార్టీ ఓ సర్కస్ కంపెనీతో పోల్చారు. సాక్షిలో తనపై ఇష్టానుసారంగా కథనాలు వస్తున్నాయని.. దీనిపై త్వరలోనే లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని లగడపాటి చెప్పారు. ఇష్టమొచ్చినట్లుగా కథానాలు ప్రసారాలు వస్తే.. చూస్తూ ఊరుకోనని లగడపాటి తేల్చేశారు. తాను తలుచుకుంటే 100 ఛానెళ్లు పెడతానని చెప్పుకొచ్చారు. ఇకపై తాను సాక్షి పత్రికను కానీ.. టీవీని కానీ చూడనని చెప్పేశారు. ఇలాంటి బెదిరింపులు చాలానే చూశానని.. వీటికి బెదిరేది లేదన్నారు. సాక్షి కథనాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తానని.. దీనిపై పోరాడతానని చెప్పారు. సాక్షి మీడియా కాంగ్రెస్ కోసమే అని ఆనాడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు కానీ.. ఇప్పుడది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. సొంత ఆస్తిలాగా జగన్ దాన్ని పట్టుకుపోయారని అన్నారు. వైఎస్ ఇందిరమ్మ రాజ్యం కావాలని పోరాడితే.. జగన్ అదే కాంగ్రెస్ ను ఎందుకు కాదంటున్నారని మండిపడ్డారు. వైఎస్ కొడుగ్గా.. జగన్ ఆగడాలను ఇన్నాళ్లూ చూస్తూ ఊరుకున్నాం.. కానీ ఇకపై అలా జరగదని అన్నారు. వైఎస్ పెట్టేవాడైతే.. జగన్ కొట్టేవాడన్నారు. వైఎస్ పై ఉన్న గౌరవంతోటే.. జగన్ కు ఎంపీ సీటు ఇచ్చామన్నారు. వైఎస్ పాదయాత్ర సమయంలో జగన్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. 2004 లో పోటీ చేసేందుకు జగన్ భయపడ్డాడని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నాం కానీ.. కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గునపం చెక్కారన్నారు. బాబాయ్ వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇస్తే.. జగన్ ఓర్వలేదని.. ఆయన్ని వేధించారని లగడపాటి అన్నారు. జగన్ వర్గం ఆగడాలను సహించే ప్రశ్నే లేదన్నారు. వైఎస్ మరణంపై ఊరు పేరు లేని వెబ్ సైట్లు ప్రచారం చేస్తే.. వాటిని పట్టుకుని జగన్ మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని చెప్పారు. ఎవరు ఎంతగా చెప్పినా ఆనాడు.. వైఎస్ రచ్చబండకు బయలుదేరి వాతావరణం సరిగ్గా లేకుండానే.. ఆయన మరణించారని లగడపాటి చెప్పారు. దీనిపై సీబీఐ కూడా ఇదే విషయాన్ని తేల్చేసిందని చెప్పారు. దీనిపై సొంతమీడియాలో రకరకాల కథనాలు చేస్తూ.. ప్రజలను రెచ్చగొడుతున్నారని.. ఇది ధర్మమా.. న్యాయమా అని ప్రశ్నించారు. చావుకి పెళ్లికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. సహనానికీ ఓర్పు ఉంటుందని.. జగన్ ఆగడాలను అందరూ చూస్తున్నారన్నారు. జగన్ పార్టీపై ఆయన టీమ్ పై ప్రజలు తప్పక బుద్ది చెబుతారని లగడపాటి అన్నారు. వైఎస్ లాగా తనలో కూడా కోపం లేదని.. చాలా కొద్ది సందర్భాల్లోనే ఇలా ఆవేశంగా మాట్లాడతానని లగడపాటి అన్నారు. తనకు భగత్ సింగ్, నేతాజీ లాంటి వారు ఆదర్శమని.. కాంగ్రెస్ లోకి వచ్చాక చాలా శాంతంగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు. రాముడిలా ఉంటా.. అవసరమనుకుంటే అపరిచితుడిలా ఉంటా అంటూ లగడపాటి చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!