వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్‌లు దోస్తీ చేస్తున్నాయా..?
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డిగాని, గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయక్ష్మిగాని రెండు రోజుల ప్లీనరీ సమావే శంలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒక్క మాట కూడా విమర్శించకపోవడంలోని ఆంతర్యం ఏమిటన్న చర్చ జరుగుతోం ది.పార్టీపరంగా అనేక తీర్మానాలు చేశారు. ఆ సందర్భంగా పలువురు మాట్లా డారు. వారంతా ప్రధానంగా జగన్ ను గొప్పగా పొగడ డానికి ప్రాధాన్యం ఇచ్చారు.అందులో పెద్ద ఆశ్చర్యంలేదు. అయితే జగన్ కాని, విజయమ్మ కాని సోనియాగాంధీని కాని, కాంగ్రెస్ హై కమాండ్ లోని ఇతర పెద్దలను కాని ఎక్కడా విమర్శించకుండా ప్రసంగాలు చేయడంపై రాజకీయవర్గాలలో ఆశ్చర్యం కలిగిస్తోంది.దీని వెనుక ఏమైనా మతలబు ఉందా అన్న చర్చ జరుగుతోంది.విజయలక్ష్మి ప్రారంభోపన్యాసం చేశారు. అందులో సోనియాగాంధీ వద్దకు తామంతా వెళ్లిన ఘట్టాన్ని వివరించినప్పుడు కూడా సోనియాగాంధీ గారు అంటూ గౌరవ వచనాన్ని వాడారు. ఇక జగన్ తొలిరోజు తీర్మానాల పై అరగంట ప్రసంగించినా తన వాగ్దానాలను వివరించిన సందర్భంలో కూడా సోనియాగాంధీని విమర్శించలేదు. అలాగే తెలంగాణపై తన అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు కూడా సోనియాగాంధీ గురించి ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా మాట్లా డారు. కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, పంచాయతీ పెద్దగా ఉన్న కేంద్రం అందరి అభిప్రాయాలు తీసుకుని , ఎవరికి నష్టం లేకుండా నిర్ణ యం చేయాలన్నమాట చెప్పారు తప్ప, సోనియాగాంధీనే ఆ పంచాయతీ పెద్ద అన్న సంగతి గురించికాని, ఆమె పాత్ర గురించి కాని ఏమీ మాట్లాడకపోవడం గమనార్హమని అంటున్నారు.దీనిపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ప్రశ్నించగా, రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని అంటూనే ప్రస్తుతానికి అయితే ఎలాంటి చర్చలు జరగలేదని అన్నారు. అయితే టిడిపి అధినేత చంద్రబా బు నాయుడు మాత్రం జగన్ కు కాంగ్రెస్ హై కమాండ్ కు మధ్య చర్చలు జరుగుతున్నాయని, గులాం నబీ అజాద్ ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నారన్నది తమ సమాచారమని ఆయన అన్నారు.మొత్తం మీద జగన్ తాను ఎందుకు సోనియాను విమర్శించ లేదో వివరణ ఇవ్వవలసి ఉంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి