తెలంగాణ బిల్లు పెట్టాల్సిందే..!



ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం ఎంత తీవ్రంగా ఉన్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ ట్టుగా ఉండ‌టం స‌హించ‌లేమ‌ని, త‌క్ష‌ణ‌మే పార్లమెంట్‌లో తెలం గాణ రాష్ట్ర బిల్లును తక్షణం ప్రవేశ పెట్టాలని BJP పార్లమెంటరీ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఏన్నేళ్లైనా…ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం సాధ్యం కాదని…ఈ విషయంలో పంతాలకు పోకుండా సంప్రదింపులు, ఏకాభిప్రాయం అన్న అంశాలను పక్కన పెట్టి… తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రమంత్రులు ప్రణబ్‌, చిదంబరంలకు సుష్మా విజ్ఞప్తి చేశారు.
తెలంగాణాపై సావధాన తీర్మానంపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. తెలంగాణ చరిత్ర గొప్పదని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్ధానం నేరవేర్చుకోలేదని నెహ్రూ హయాం నుంచి 2009 డిసెంబర్‌ 9 చిదంబరం ప్రకటన వరకూ అన్ని ముఖ్య ఘట్టాలను సభలో ప్రస్తావించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!