అనంత సంపద వెనుక కన్నీటి కథలు – 2



ట్రావెన్ కోర్ రాజ్యం (తిరువనంతపురం రాజ్యం) అనేక ఒత్తిళ్లకు గురవుతుండేది. నాటి రాజులకు యుద్ధభ యం ఉండేది. మార్తండ వర్మ 1750 ప్రాంతంలో తన రాజ్యాన్ని అనంతపద్మనాభస్వామి పాదాలకింద ఉంచేశాడు. అంటే, రాజ్యభారాన్ని స్వామికే వదిలేశాడు. మామూలుగా మాటలతో చెప్పడంకాదు, ఈ మే రకు రాజశాసనం చేశాడు. అప్పటి నుంచి ట్రావెన్ కోర్ రాజ్య భారం అనంత పద్మనాభస్వామిదే అయింది. రాజు అన్న వాడు కూడా పద్మనాభ దాసుడే. రాజ్యంలోని ప్రతిఒక్కరూ పద్మ నాభదాసులే నంటూ చాటిం చాడు. దీంతో మార్తండ వర్మకు కొంతలో కొంత యుద్ధ భయం తీరింది. సాక్షాత్తు పద్మనాభుడే రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు సహజంగానే హిందూ రాజు లెవ్వరూ ఆ రాజ్యం జోలికి పోయేవారు కాదు. పైగా, తమకు తోచిన కానుకలను ఇచ్చి పంపేవారు. అలా మార్తండ వర్మ రాజనీతి ఫలించింది. యుద్ధాలు లేకుండానే సిరిసంపదలు వచ్చిపడ్డాయి. అలా వచ్చిన నిధులను ఆలయం నేలమాళిగల్లో భద్రపరిచేవారు.
అయినప్పటికీ, శైవమతానికి చెందిన రాజులు కొంత మంది అనంత పద్మనాభుని రాజ్యంపై కన్నేశారు. కొన్ని చోట్ల తీవ్రమైన దాడులు జరిపారు. వైష్ణవాలయాలను కొల్లగొట్టారు. అక్కడ ఉన్న నిధినిక్షేపాలను తరలించు కుపోయారు. అడ్డువచ్చిన వారిని నరికి చంపేసేవారు. ఈ క్రమంలోనే ట్రైవెన్ కోర్ రాజ్యం అప్రమత్తం కావాల్సి వచ్చింది.  సంపదను భవిష్యతరాలవారికి క్షేమంగా అందజేయడం ఎలా అన్న విషయంపై రాజవంశస్థులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రాతికట్టడాల్లో నైపుణ్యం ఉన్న శిల్పులను, నిపుణులను రప్పించి అత్యంత భద్రమైన నేలమాళిగ ఏర్పాటు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా చెక్కుచెదరకుండా ఉండేలా వాటి ని తీర్చిదిద్దారు. ఆలయాన్నే కోశాగారంగా మార్చారు. ఆలయ మూర్తినే చక్రవర్తిగా మార్చేశారు. అయితే, సంస్థానాధీశుల నిరంకుశ వైఖరి కారణంగా పన్నుల రూపంలో ధనరాశులు రాబట్టారు. చివరకు బిడ్డకు పాలివ్వాలన్నా ఆ తల్లి సుంకం చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ దోపిడీ విధానాలేమిటో తరువాయి భాగంలో తెలుసుకుందాం..

- తుర్లపాటి నాగభూషణ రావు
98852 92208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!