అల్లు, త్రివిక్రమ్‌ల సినిమా సెట్‌పైకి
ఇందులో అల్లు అర్జున్ సరసన గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా ఎంపికయింది. ఆర్య,బన్ని, ఆర్య2 లాంటి మ్యూజికల్ హిట్స్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అల్లు అర్జున్ తో దేశ ముదురు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన దానయ్య, ఎస్. రాధాకృష్ణ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
పంచ్ డైలాగులు చెప్పడంలో బన్నీకి ఓ స్టైల్ ఉంది. పంచ్ డైలాగులు చెప్పించడంలో త్రివిక్రమ్ కి ఓ స్టైల్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి