రాజ‌కీయ చ‌రిత్రలో మ‌హిళా ముఖ్యమంత్రులు..


త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్ ఇద్దరు నారీమ‌ణులు వీరోచితంగా పోరాడి అధికార పీఠాన్ని సొంతం చేసుకుని ముఖ్యమంత్రి ప‌ద‌వి అధిష్టించ‌బోతున్నారు. అయితే ఇప్పటి వ‌ర‌కూ దేశంలో ఎంత మంది మ‌హిళ‌లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారో తెలుసుకుందాం..
1963-67 ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్‌లో సుచేతా కృప‌లానీ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున దేశంలో తొలి మ‌హిళా ముఖ్యమంత్రిగా ప‌నిచేసారు.
1972లో ఒరిస్సా ముఖ్యమంత్రిగా నందినీ శ‌త‌ప‌తి అధికారాన్ని చేప‌ట్టారు.
1973లో శశిక‌ళా కాకోద్కర్ గోవా ముఖ్యమంత్రి ప‌ద‌విని అధిష్టించారు.
1980లో కాంగ్రెస్ పార్టీకి చెందిన స‌య్యద్ అన్వరా తైమూర్ అస్సాం ముఖ్యమంత్రిగా ప‌ద‌వి చేప‌ట్టారు.
1988లో ఎంజీ రామ‌చంద్రన్ భార్య జాన‌కీ రామ‌చంద్రన్ నెల‌రోజుల పాటు త‌మిళ‌నాడు ముఖ్యమంత్రిగా అధికారం చేప‌ట్టారు.
1991లో మ‌రియు 2001 నుండి 2006 వ‌ర‌కు జ‌య‌ల‌లిత రెండు సార్టు త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా మూడోసారి ఆమె ముఖ్యమంత్రి ప‌ద‌విని అధిష్ఠించ‌బోతున్నారు.
1995లో బీఎస్పీ నేత మాయావ‌తి ఉత్తర‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప‌ద‌వి చేప‌ట్టారు.
బీహార్‌లో ర‌బ్రీదేవి మూడు సార్టు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు.
భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత సుష్మాస్వరాజ్ 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రి ప‌ద‌విని అధిష్ఠించారు.
షీలాదీక్షిత్ 1998 నుండి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొన‌సాగుతున్నారు.
2003 నుంచి 2004 వ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత ఉమా భార‌తి మ‌ధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొన‌సాగారు.
2003లో భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు వ‌సుంధ‌రా రాజె సింధియా రాజ‌స్థాన్ ముఖ్యమంత్రిగా ప‌నిచేసారు.
2011లో 34 సంవ‌త్సరాల సిపిఐ పాల‌న‌ని అంతంచేసి ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్నారు మ‌మ‌తా బెన‌ర్జీ.
ఇప్పటి వ‌ర‌కూ దేశంలో మొత్తం 14 మంది మ‌హిళ‌లు ముఖ్యమంత్రులుగా కొన‌సాగారు. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలు, భార‌త‌ రాష్ట్రప‌తి, స్పీక‌ర్, మ‌న రాష్ట్రంలో హోం మంత్రి కూడా మ‌హిళ‌లే కావ‌డం విశేషం.

కామెంట్‌లు

  1. తెలుగువాళ్ళు మంత్రిలు అని పలకరు, రాయరు. అది మంత్రులు లేదా మంత్రిణులు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!