బ‌ద్రీనాథ్ మూవీ రివ్యూ..


సంస్థ: గీతా ఆర్ట్స్‌
నటీనటులు: అల్లు అర్జున్‌, తమన్నా, ప్రకాష్‌ రాజ్‌, కెల్లీ దోర్జ్‌, అశ్వనీ కల్‌శేఖర్‌, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, వేణుమాధవ్‌, గీతాసింగ్‌, కృష్ణభగవాన్‌ తదితరులు.
రచన: చిన్నికృష్ణ
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
నిర్మాత: అల్లు అరవింద్‌
దర్శకత్వం: వివి వినాయక్‌
అల్లు అర్జున్, వివివినాయ‌క్ కాంబినేష‌న్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన చిత్రం బ‌ద్రినాథ్‌. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా మూడు భాష‌ల్లో విడుద‌ల‌యింది.. క‌థ విష‌యానికి వ‌స్తే..
భీష్మనారాయణ్‌ (ప్రకాష్‌రాజ్‌) మన దేశంలో ఉన్న 138 పుణ్యక్షేత్రాలను కాపాడటానికి క్షేత్రపాలకులను తయారుచేయాలని పూనుకుంటాడు. అలా శిక్ష‌ణ ఇచ్చిన వారిని ఆయా క్షేత్రాల‌కు క్షేత్ర పాల‌కులుగా పంపుతారు. అలా శిక్ష‌ణ తీసుకున్న‌ యోధులలో ఒకరు బద్రి(అల్లు అర్జున్). బ‌ద్రిలోని ఆకుంఠిత దీక్ష‌, ప‌ట్టుద‌ల భీష్మ‌నారాయ‌ణ‌కి బాగా న‌చ్చుతుంది. బద్రినాథ్‌కి క్షేత్ర‌పాల‌కుడిగా ఉండేందుకు బద్రినాథ్‌ క్షేత్రం నియ‌మించ‌బ‌డుతుంది. బద్రినాధ్ క్షేత్రానికి అలకనంద (తమన్నా) వస్తుంది. అలకానంద నాస్తికురాలు, ఆమెకి దేవుడంటే ఇష్టం వుండ‌దు. అయితే బ‌ద్రి ఆమెకి దేవుడిని ప్రేమించేలా చేస్తాడు. అయితే  అలకనంద‌ ప్రాణాలకు ఆమె మామ‌యిన‌ శంకర్(కెల్లీ దోర్జి) నుంచి ముప్పు ఉందని తెలుసుకున్న బద్రి ఆమెను కాపాడే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకొంటాడు‌. దాంతో అల‌క‌నంద బ‌ద్రిని ప్రేమించ‌డం మొద‌లు పెడుతుంది. కానీ బద్రి సాహసాలకు, భక్తికి మెచ్చిన భీష్మ నారాయణ అతన్ని తక్షశిలకు తన తరవాత గురువును చేయాలనుకుంటాడు. అలా చేయాలంటే బ‌ద్రి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండాలి. చివ‌రికి అల‌క‌నంద త‌న ప్రేమ‌ని బ‌ద్రితో పంచుకుంటుందా.. భీష్మ నారాయణ తాను అనుకున్న‌ట్టు బ‌ద్రిని గురువుగా చేసాడా.. అల‌కనంద‌ని శంక‌ర్ నుండి బ‌ద్రి ఎలా కాపాడాడు.. అన్న‌ది మిగ‌తా క‌థ‌.

తొలిసారి వినాయక్ సినిమాకు కీరవాణి బాణిలను అందించిన ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో అంచనాలకు కేంద్ర బిందువు అయింది. కానీ ఆ అంచ‌నాల‌ని త‌ల‌కిందులు చేస్తుంది. క‌థ స‌రిగా కూర్చ‌క‌పోవ‌డం, క‌థ‌నం మ‌రీ బ‌ల‌హీనంగా ఉండ‌డం, మాట‌లు కూడా అంత‌గా ఆక‌ట్టుకునేలా లేక‌పోవ‌డం ఈచిత్రానికి ప్ర‌ధాన లోపాలు. ఈ సినిమాలో హీరో పాత్ర తప్ప మిగిలినటువంటి ఎవరి పాత్రలు కూడా అంత ఆసక్తిగా లేవు. కధనంలో పట్టులేదు. ఇక సినిమా మొదటి భాగానికి వస్తే సగంలోనే కధ మొత్తం అర్దం అయిపోవడంతో సెకండ్ హాఫ్ అంతా భారంగా నడుస్తుంది. గతంలో వివి వినాయక్ తీసినటువంటి సినిమాల్లో పెద్దగా కధ లేకపోయినప్పటికీ సూపర్ డూపర్ హిట్ కోట్టినటువంటి సందర్బాలు ఉన్నాయి.
ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి రూపొందించిన మ‌గ‌ధీర సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ సాధించ‌డంతో అలాంటి క‌థ‌ల‌తో సినిమాలు తీసి స‌క్సెస్ సాధించాల‌ని శ‌క్తి సినిమాతో మెహ‌ర్‌ర‌మేష్‌, ఈ సినిమాతో వి.వి. వినాయ‌క్‌లు కృషి చేసినా.. మ‌గ‌ధీర‌లో క‌థ‌, క‌థ‌నం చ‌క్క‌గా పండినంతంగా ఈ చిత్రాల‌లో పండించ‌డంలో ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు ఫెయిల్ అయ్యారు. కేవ‌లం గ్రాఫిక్స్‌తో అద్భుతాలు సృష్టించి, హీరోతో వీరోచితాలు చేయించి స‌క్సెస్ సాధించాలంటే కుద‌ర‌ద‌ని ద‌ర్శ‌కులు గ‌మ‌నించాలి. క‌థా ర‌చ‌యిత చిన్నికృష్ణ ఈ చిత్రం విడుద‌ల‌కి ముందు ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ సాధిస్తుంద‌ని ఊద‌ర‌గొట్టారు.. కానీ.. ఈ చిత్రం ఫ‌లితం మాత్రం తారుమార‌యింది.
న‌ట‌నా ప‌రంగా అల్లు అర్జున్ యాక్ష‌న్‌, డాన్స్‌ల‌లో త‌న‌దైన మార్కుతో న‌టించాడు. చ‌క్క‌ని డాన్స్‌, ఫైట్స్ అల్లు అర్జున్ అభిమానుని అల‌రిస్తాయి. ఇక త‌మ‌న్నా ఎంతో క్యూట్‌గా క‌నిపిస్తుంది.. మిగ‌తా న‌టీన‌టుల విష‌యానికొస్తే..
భీష్మ నారాయణగా ప్రకాష్ తన సహజ శైలిలో నటించిన పాత్రలో క్లారిటీ లేక చివరికి వచ్చేసరికే తెల్లబోయింది. ఇత కమెడియన్స్ బ్రహ్మానందం, యం.యస్, కృష్ణ భగవాన్, ధర్మవరం చేసినటువంటి కామెడీ కొంచెం ఫరవాలేదని అనిపించింది.
క‌థ‌, క‌థ‌నం చాలా వీక్‌గా ఉన్నాయి.
సంగీతం ఫ‌ర్వాల‌దు..
సినిమాటోగ్ర‌ఫీ సోసోగా ఉంది..
ఓవ‌రాల్‌గా ఎన్నో అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకి వ‌చ్చిన బ‌ద్రినాథ్ అంచ‌నాల‌ని ఏమాత్రం అందుకోలేక‌పోయింది..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

జపాన్ రేడియేషన్ ఇండియాకు వచ్చేస్తోందా?