మాయావ‌తి ఓ ప‌వ‌ర్ బ్రోక‌ర్‌


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై వికీలిక్స్ పెద్ద బాంబే పేల్చింది. రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషించడమే.. ఉత్తరప్రదేశ్ కు ఆమె చేసిన అభివృద్దిగా వికీలిక్స్ పేర్కొంది. కాగా అందరూ అనుకుంటున్నట్లుగానే.. మాయావతికి.. భారత ప్రధాని కావాలని కోరిక ఉన్నట్లు వికీలీక్స్ బయటపెట్టింది. ప్రధాని పదవే మాయావతి చిరకాల వాంఛగా పేర్కొంది. దీంతో పాటు.. మాయావతి కున్న చిత్రమైన అలవాట్లపై కూడా వికీలీక్స్ బయటపెట్టింది. ఆమే తీసుకునే అహారం.. అంతకుముందే ఇద్దరు రుచి చూడాల్సిందే. ఆహారం టేస్ట్ చేయడం కోసం.. ఓ ఇద్దరిని నియమించింది. అంతేకాదు.. రుచికరమైన వంటకాలు తయారు చేసేందుకు 9 మంది వంటగాళ్లు కూడా ఉన్నారట. ఇక అన్నింట్లో సంచలనం ఏంటంటే.. తనకిష్టమైన బ్రాండ్ చెప్పుల జత కోసం.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి.. ముంబైకి ఓ ప్రైవేట్ జెట్ విమానాన్ని పంపిచారని వికీలిక్స్ పేర్కొంది. చెప్పులు తీసుకొచ్చేందుకే ఈ విమానాన్ని ఖాళీగా పంపించిందని.. పేర్కొంది. ఇక 2007 మే తర్వాత.. ఆమే రాష్ట్రానికి చేసిన అభివృద్ది ఏమీ లేదని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని.. తెలిపింది. పుట్టినరోజున ఆమెకు పెద్దమొత్తంలో కార్యకర్తల నుంచి.. సామాన్య జనం వరకు డబ్బు మూటలు అందజేస్తారని.. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ భారీగా డబ్బు ఖర్చుపెట్టబోతోందని వికీలీక్స్ బయటపెట్టింది. మాయావతి పవర్ బ్రోకర్ పాత్ర పోషిస్తుందని వికీలీక్స్ కథనం సారాంశం. కాగా తెలంగాణ విషయంలో స్పీకర్ నాదెండ్లతో పాటు.. కాంగ్రెస్ హైకమాండ్ పై కొన్ని ఆసక్తికరమైన వార్తలను కూడా ఇంతకుముందే ప్రచురించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!